న్యూజిలాండ్ (New Zealand) మాజీ మహిళా ప్రధాన మంత్రి జసిందా కేట్ లారెల్ ఆర్డెర్న్ (Jacinda Ardern) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె న్యూజిలాండ్ పార్లమెంట్‌లో వీడ్కోలు సభలో ప్రసంగించారు. ‘‘మంచి తల్లిగా ఉండేందుకే నేను రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నా. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు, నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మాతృత్వం అడ్డంకి కాకూడదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మాత్రం రాజకీయాలు చేయకండి. రాజకీయాలను దానికి దూరంగా ఉంచండి’’అని జెసిండా పేర్కొన్నారు.
2017లో న్యూజిలాండ్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆర్డెర్న్ అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రధానమంత్రి అయ్యారు. జసిందా ఐదేళ్లలో అనేక సంస్కరణలు విస్తృత స్థాయిలో జరిగాయి. దీని కారణంగా ఆమె ఇప్పుడు సంక్షోభ నిర్వాహకురాలిగా గుర్తుండిపోతుంది.
ఆమె మాట్లాడుతూ..నేను రాజకీయాలకు దూరంగా ఉంటే, నేను మంచి తల్లిగా ఉండగలను. నాయకత్వ పాత్రలకు మాతృత్వం అడ్డు రాకూడదని నేను మహిళలకు చెప్పాలనుకుంటున్నాను. అలాగే మహిళలు తమ విధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.
Also Read: ‘Parivar welcomes you Modi Ji’ : ప్రధాని పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
ఆర్డెర్న్ వయసు 42 సంవత్సరాలు. 37 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 26 జూలై 1980న హామిల్టన్‌లో జన్మించారు. ఆమె క్లార్క్ గేఫోర్డ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత 2017లో న్యూజిలాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించింది. దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే పనిలో జసిందా బిజీగా ఉన్నప్పుడు ఆమె గర్భవతి అని తెలిసింది. ఆ తర్వాత 21 జూన్ 2018న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రధానమంత్రి పదవిలో ఉండగా ప్రసవించిన ప్రపంచంలో రెండవ పాలక మహిళగా జసిందా ఆర్డెర్న్ నిలిచింది.
ఏప్రిల్ 5, బుధవారం వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్ పార్లమెంట్‌లో 42 ఏళ్ల జసిండా తన చివరి ప్రసంగం చేసింది. ఇందులో ఆమె ఇలా చెప్పింది. “నేను రాజకీయాలను వదిలివేస్తున్నాను. నేను ఇక్కడ లేకుంటే బహుశా నేను మంచి తల్లి అవుతాను.” ఇప్పటి వరకు ప్రముఖ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జసిందా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2019లో రెండు పుణ్యక్షేత్రాలపై తీవ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 51 మంది ఆరాధకులు మరణించారు. అదే సంవత్సరం తరువాత అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఇందులో 22 మంది మరణించారు.