Viral Video : న్యూజిలాండ్ పార్లమెంట్ ను దడ దడలాడించిన 21 ఏళ్ల మహిళ ఎంపీ

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 03:28 PM IST

21 ఏళ్ల మహిళ ఎంపీ 170 ఏళ్ల న్యూజిలాండ్ (New Zealand) పార్లమెంట్ (Parliament ) చరిత్రను తిరగరాసింది. తమ కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ ఓ యువ ఎంపీ తన ప్రసంగంతో పార్లమెంట్ ను దడ దడలాడించింది. సదరు యువ మహిళ ఎంపీ పేరు హనా-రౌహితి మైపి క్లార్క్‌ (Hana Rawhiti Maipi Clarke) (21). 170 ఏళ్ల న్యూజిలాండ్‌ పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించింది.

గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికైంది. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె తాత కూడా ఓ సామాజిక కార్యకర్త. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. అక్కడ మావోరి కమ్యూనిటీకి చెందిన చిన్నారుల కోసం గార్డెన్‌ నడుపుతూ చిన్నారులకు తోటపనిపై అవగాహన కల్పిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

గత నెలలో ఆమె పార్లమెంటులో ప్రసంగించారు. ‘మావోరీ భాషలో మీ కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడంతో పాటు మీ ప్రాణాలను రక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొంది. మావోరీ తెగకు చెందిన విద్యార్థులు తమ భాషలో చదువుకునే అవకాశం రాకపోవడంతో వారు అభివృద్ధి చెందడం లేదని.. ఇకపై మాతృభాష నేర్చుకోవడానికి మావోలు బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.. మావోరీ భాషలో హనా ప్రసంగానికి నెట్టింట భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లతో వైరల్‌గా మారింది.

Read Also : 2024 Sankranti : సంక్రాంతి పండగ వేళ ఓ ‘కీడు’ ప్రచారం వైరల్ గా మారింది..