Site icon HashtagU Telugu

New Zealand: న్యూజిలాండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. వాటిపై కూడా ట్యాక్స్‌..?

107133074 1665569961870 Gettyimages 128104810 23715862 1280x720 11zon

107133074 1665569961870 Gettyimages 128104810 23715862 1280x720 11zon

న్యూజిలాండ్ ప్ర‌భుత్వం వ్యవసాయ ఉద్గారాలపై పన్ను విధించాలని యోచిస్తోంది. ఆవులు, గొర్రెలు వంటి పశువుల నుండి మూత్రం, పేడకు సంబంధించిన వాటిపై ట్యాక్స్ విధించాల‌ని చూస్తోంది. దీంతో దేశ వాతావరణ మార్పు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది.

గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచన చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆవులు, గొర్రెల పెంపకందారులకు ట్యాక్స్ విధించనునున్న‌ట్లు చూస్తోంది. వాటి నుంచి విడుదలయ్యే మీథేన్ ప్రమాదకరంగా ఉన్నట్టుగా గుర్తించింది. దాన్ని తగ్గించేందుకు ట్యాక్స్ వేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అక్కడ 60.2 లక్షల ఆవులు ఉన్నాయి. వీటి నుంచే పెద్ద ఎత్తున మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇందులో భాగంగానే 2025 నాటికి వ్యవసాయ రంగం నుంచి వచ్చే గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆవులు, గొర్రెల పెంపకందారులకు ట్యాక్స్ విధించాలనే ఆలోచన చేస్తోంది.

మిథేన్ అనేది ఒక గ్రీన్ హౌస్ వాయువు. గ్రీన్ హౌస్ వాయువులు గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతాయి. పర్యావరణం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కార్బన్ డై ఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ వాయువే. కానీ దీని కంటే మీథేన్ 20 నుంచి 60 రెట్లు హానికరం. ఆవులు, గొర్రెలు విడుదల చేసే గ్యాస్‌లో అధిక పరిమాణంలో మీథేన్‌ వాయువు ఉంటుంది.

తేన్పులు ఇచ్చినప్పుడు కూడా వాటి నుంచి మీథేన్ వాయువు వెలువడుతుంది. న్యూజిలాండ్‌లో సుమారు 60.2లక్షల ఆవులు ఉన్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు విడుదలవుతున్న గుర్తించిన ప్రభుత్వం వాటిని పెంచే పెంపకందారులపై ట్యాక్స్‌ విధించాలని చూస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని కూడా తెలిపారు. ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బును మ‌ర‌లా రైతుల కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు.