Site icon HashtagU Telugu

Largest Sandwich : గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ప్రపంచంలోనే బిగ్ చీజ్ శాండ్ విచ్ చేసిన యూట్యూబర్స్

Largest Sandwich in World

Largest Sandwich in World

Largest Sandwich : ప్రస్తుతం మనకు మార్కెట్లో రకరకాల శాండ్ విచ్ లు అందుబాటులోకి వచ్చాయి. వాటన్నింటిలోనూ చాలా మందికి చీజ్ శాండ్ విచ్ అంటే చాలా ఇష్టం. ఈ శాండ్ విచ్ తోనే తాజాగా ఇద్దరు యూట్యూబర్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రిల్డ్ చీజ్ శాండ్ విచ్ ను తయారు చేశారు. అమెరికాకు చెందిన ఇద్దరు యువకులు యూట్యూబ్ లో లక్షమంది సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నారు. తమ ఆలోచనకు పదునుపెట్టి.. క్రియేటివిటీని వాడి.. అతిపెద్ద చీజ్ శాండ్ విచ్ ను తయారు చేశారు. కానీ.. ఇది కేవలం యూట్యూబ్ రీచ్ కోసం చేయగా.. ఆ ప్రయత్నం తమ పేరుమీద గిన్నిస్ వరల్డ్ రికార్డును తెచ్చిపెట్టింది.

అక్టోబర్ 21నే వారు ఈ రికార్డును పూర్తి చేయగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నవంబర్ 27న ధృవీకరించబడింది. 11 ఏళ్ల ఎక్సోడస్, 10 ఏళ్ల ఇగ్గీ చౌదరి 1.89 మీటర్లు, 189.9 కిలోల బరువైన శాండ్ విచ్ ను తయారుచేయడంలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు సహాయం చేశారు. 2.7 అంగుళాల మందంతో తయారు చేసిన ఆ శాండ్ విచ్ లో కిం ఉన్న బ్రెడ్ స్లైస్ ను ఓపెన్ ఫ్లేమ్స్ పై ఫ్రై చేసి.. పై భాగంలో బ్రెడ్ ను బ్లో టార్చ్ ను వాడి ఉడికించారు. చీజ్ మొత్తం కరిగేలా, రెండువైపులా శాండ్ విచ్ కావలసినంతగా కాలేలాగా దానిని తయారు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా ఎలా తయారు చేశారో ఒక వీడియోలో చూసిన వారిద్దరూ.. ఈ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరూ కలిసి తయారు చేసిన శాండ్ విచ్ ను అందరూ ఎంతో ఆనందంగా తిన్నారు. దీనికి ముందున్న రికార్డ్ కంటే.. ఇది 35 శాతం పెద్దదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. గతంలో ఒక జర్మన్ జంట శాండ్ విచ్ తయారు చేసి రికార్డును సాధించగా.. వారిలో ఒకరు కళ్లకు గంతలు కట్టుకుని, మరొకరు చేతులు ఉపయోగించకుండా 40 సెకండ్లలో శాండ్ విచ్ తయారు చేశారు.