జపాన్(Japan )లో ప్రస్తుతం “న్యూ బాబా వాంగా” జోస్యం (New Baba Vanga Prediction) చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. ఆమె చెప్పిన జోస్యం ప్రకారం.. రేపు (జులై 05) దక్షిణ జపాన్‌లో పెను ప్రకృతి విపత్తు సంభవించనున్నదన్న వార్తలు అక్కడ ప్రజల్లో తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఈ మధ్యే టొకారో ద్వీపాల్లో కేవలం రెండు వారాల్లో 900కు పైగా భూకంపాలు నమోదు కావడం ఈ ఆందోళనను మరింత పెంచింది. ప్రకృతి లక్షణాలు చూస్తే ఏదైనా పెద్దదైన ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు కూడా చెప్పడం మరింత భయాన్ని పెంచుతోంది.
Thammudu : నితిన్ ‘తమ్ముడు’ మూవీ పబ్లిక్ టాక్
న్యూ బాబా వాంగా అనే వ్యక్తి పేరు గోప్యంగా ఉంచబడినప్పటికీ, ఆమె చేసిన పలు జోస్యాలు నెరవేరినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తిని ముందుగానే ఊహించినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. అంతేకాకుండా 2030 నాటికి మరింత ప్రాణాంతకమైన వైరస్ రాబోతుందని, అలాగే కొన్ని భూకంపాలు, సముద్ర అలలు (సునామీలు), రాజకీయ మార్పుల గురించిన జోస్యాలూ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్!
ఆమె జోస్యాల నేపథ్యంలో ప్రజల్లో భయం పెరుగుతున్నా, శాస్త్రీయంగా వాటికి సరైన ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న జపాన్‌లో ఈ తరహా ప్రకటనలు సామాజిక ఆందోళనకు దారితీసే అవకాశముంది. అందువల్ల ప్రజలు అపోహలకు లోనవకుండా అధికారిక సమాచారం ఆధారంగానే విశ్వసించాలని సూచిస్తున్నారు. భయంతో కాక, అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమ మార్గమని నిపుణులు హితవు పలుకుతున్నారు.