Site icon HashtagU Telugu

యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్.. ఇకపై వాటికి కూడా చెల్లించాల్సిందే!

Netflix

Netflix

కరోనా మహమ్మారి రావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. థియేటర్లకు డిమాండ్ ను తగ్గించాయి. ఓటీటీల ప్రభావం వల్ల సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే ఓటీటీల్లో కూడా చాలా వరకూ పోటీ పడుతున్నాయి. ఓటీటీలకు ఇటీవల విపరీతమైన డిమాండ్ రావడంతో అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలతో పాటు దేశీయంగా కూడా అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ సేవలు అందించడం మొదలు పెట్టాయి.

ఇప్పుడు కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్​ అవ్వడం కామన్ అయిపోయింది. దీంతో ఓటీటీ సబ్​స్క్రిప్షన్​లు భారీగానే పెరుగుతూ వస్తున్నాయి. అయితే చాలా మంది ఫ్యామిలి, ఫ్రెండ్స్​లో ఎవరో ఒకరు మాత్రమే సబ్​స్క్రిప్షన్ తీసుకుని ఇతరులతో పాస్​వర్డ్​లు షేర్ చేసుకుంటూ ఉంటారు. దాంతో ఒకే సబ్​స్క్రిప్షన్​పై చాలా మంది సినిమాలు, షోలు చూడటం ఇప్పుడు జరుగుతోంది.

తాజాగా దీనిపై నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్​స్క్రిప్షన్​పై పాస్ వర్డ్ లు షేర్ చేసుకుంటూ చాలా మంది సినిమాలు చూసేస్తున్నారు. వాటి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల నష్టపోతున్నామనే కారణంతో నెట్​ఫ్లిక్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతరులకు నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేర్ చేస్తే ఛార్జీలు వసూలు చేయాలని షాక్ ఇచ్చింది.

ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి ఆ తర్వాత అందరికీ దీనిని వర్తింపజేయనున్నారు. ఒక్కో ఎక్స్​ట్రా డివైజ్​కు 2 నుంచి 3 డాలర్ల చొప్పున వసూలు చేసే అవకాశముందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నెట్​ఫ్లిక్స్​తో పాటు అమెజాన్ ప్రైమ్​, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్ వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ కూడా పరిమిత సంఖ్యలో డివైజ్​లలో లాగిన్​కు వీలు కల్పిస్తూ వస్తున్నాయి. అయితే కొన్నింటిలో ఒక సారి ఒక డివైజ్​లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే వీలుంటుంది. వాటన్నింటిలో నెట్​ఫ్లిక్స్​ చాలా తక్కువ కావడంతో అందరూ దీనిని విపరీతంగా వాడేస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది.