Netanyahu In Gaza : ఓ వైపు ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం ఆయన గాజాను అకస్మాత్తుగా విజిట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. గాజాలోని ఇజ్రాయెలీ సైనికులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. హమాస్‌పై గ్రౌండ్ ఆపరేషన్‌లో ఎదురవుతున్న అవాంతరాల గురించి వారితో నెతన్యాహు చర్చించారు. గాజా మ్యాప్‌ను చూపిస్తూ అక్కడున్న ప్రాంతాలపై ఆరా తీశారు. తమ సైనికుల్లో నెతన్యాహు నైతిక స్థైర్యాన్నినింపే ప్రయత్నం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
2005 సంవత్సరంలో గాజా నుంచి ఇజ్రాయెలీ ఆర్మీ వైదొలగింది. అప్పట్లో గాజా పాలనా బాధ్యతలను పాలస్తీనియన్ అథారిటీ (PA)కి అప్పగించింది. అయితే 2007లో గాజాలో చోటుచేసుకున్న రక్తపాత తిరుగుబాటు కారణంగా పాలస్తీనియన్ అథారిటీకి చెందిన ఫతా పార్టీ గాజా నుంచి వైదొలగింది. నాటి నుంచి గాజాపై మిలిటెంట్ సంస్థ హమాస్‌కు పట్టు వచ్చింది. చివరగా 2005లో నాటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గాజాలో పర్యటించారు. మళ్లీ దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత తొలిసారిగా గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు నిలిచారు.
Also Read: Whats Today : తెలంగాణలో ప్రధాని మోడీ ప్రచారం.. నర్సాపూర్‌కు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఈపర్యటన ముగిసిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేస్తూ.. ‘‘మేం చివరి వరకు, విజయం సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఏదీ మమ్మల్ని ఆపలేదు. హమాస్‌పై యుద్ధం యొక్క అన్ని లక్ష్యాలను సాధించే శక్తి, బలం, సంకల్పం మాకు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఈ మెసేజ్‌ను బట్టి బందీల విడుదల తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందనే విషయం క్లియర్ అయిపోయింది. మరోవైపు ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికా కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అమెరికా నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సప్లై అవుతున్నాయి. హైదరాబాద్ కంటే తక్కువ సైజు ఉండే గాజాపై ఇప్పటికే వేల టన్నుల ఆయుధాలను ఇజ్రాయెల్ ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో దాదాపు 50 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేసింది. మరో 200 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. వారు విడుదలయ్యే వరకు ఆగి.. ఆ తర్వాత గాజాపై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామనే సందేశాన్ని నెతన్యాహు తన తాజా ట్వీట్‌తో(Netanyahu In Gaza) చెప్పకనే చెప్పారు.