Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భార్య బుధవారం (జూలై 12) (Nepal PM Wife Passes Away) కన్నుమూశారు.

Published By: HashtagU Telugu Desk
Nepal PM Wife Passes Away

Resizeimagesize (1280 X 720) (3)

Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ భార్య బుధవారం (జూలై 12) (Nepal PM Wife Passes Away) కన్నుమూశారు. సమాచారం ప్రకారం.. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న నేపాలీ ప్రధాని భార్య సీతా దహల్ గుండెపోటుతో మరణించారు. వార్తా సంస్థ ANI ప్రకారం.. PM ప్రచండ భార్య నార్విక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సీతా దహల్‌కు మధుమేహం, రక్తపోటుతో సహా అనేక వ్యాధులు ఉన్నాయి. వాటికి చికిత్స పొందుతూ జూలై 12న ఉదయం 8 గంటలకు సీతా దహల్ తుది శ్వాస విడిచినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం పుష్ప్ కమల్ దహల్ ప్రచండ కూడా తన భార్యకు వైద్యం చేయించుకునేందుకు ముంబై వచ్చాడు. అతని భార్య సీతా దహల్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పార్కిన్సన్స్ లాంటి లక్షణాలతో బాధపడుతోంది.

Also Read: Helicopter Drop-Chandrayaan 3 : హెలికాఫ్టర్ నుంచి జారవిడిచి “ల్యాండర్” టెస్ట్.. చంద్రయాన్ 3పై మరిన్ని విశేషాలివిగో

  Last Updated: 12 Jul 2023, 10:14 AM IST