Power Outage: అంధకారంలో శ్రీలంక.. దేశంలో విద్యుత్ సేవల్లో అంతరాయం..!

సిస్టమ్ వైఫల్యం కారణంగా శ్రీలంక దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలను (Power Outage) ఎదుర్కొంటోంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి ఒకరు సమాచారం అందించారు.

  • Written By:
  • Updated On - December 9, 2023 / 09:39 PM IST

Power Outage: సిస్టమ్ వైఫల్యం కారణంగా శ్రీలంక దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలను (Power Outage) ఎదుర్కొంటోంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి ఒకరు సమాచారం అందించారు. దీని ఫలితంగా ద్వీప దేశం అంతటా విద్యుత్, ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. నివేదికల ప్రకారం.. కొత్మలే-బియాగామా ట్రాన్స్‌మిషన్ లైన్ విచ్ఛిన్నం కారణంగా శ్రీలంక అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని దేశ విద్యుత్ గుత్తాధిపత్య సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు.

Also Read: TVS Apache RTR 160 4V: భారత్ మార్కెట్ లోకి సరికొత్త బైక్.. ధర ఎంతంటే..?

శ్రీలంక దేశంలో విద్యుత్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం 5:30 నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కాగా కొలంబో వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా మారింది. విద్యుత్ సమస్య వల్ల పలు సేవలు నిలిచిపోయాయి. ప్రజలు ఆందోళన చెందారు.

We’re now on WhatsApp. Click to Join.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ద్వీప దేశంలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతోంది. రాబోయే రెండున్నర గంటల్లో మిగిలిన ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని CEB దేశానికి హామీ ఇచ్చింది. శ్రీలంకలో దేశవ్యాప్త అంతరాయం గురించి మరిన్ని వివరాలు పంచుకోలేదు.