Site icon HashtagU Telugu

NASA: సునీతా విలియమ్స్‌ను కాపాడేందుకు నాసాకు 14 రోజుల సమయం

Sunita Williams ,Butch Wilmore

Sunita Williams ,Butch Wilmore

NASA: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్ గత రెండు నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరారు. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు తమ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరిగి రాలేకపోయారు. ఇప్పుడు వారిని సురక్షితంగా తీసుకురావడానికి నాసాకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.

బోయింగ్ స్టార్‌లైనర్ జూన్ 5న ఇద్దరు వ్యోమగాములనుఅంతరిక్షానికి తీసుకెళ్లింది. జూన్ 13న స్టార్‌లైనర్ అంతరిక్షానికి చేరుకోగానే వాహనం థ్రస్టర్‌లు మరియు హీలియం సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది. ప్రారంభంలో వారం రోజుల మిషన్ తర్వాత భూమికి తిరిగి రావాలని షెడ్యూల్ చేయబడింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా వారి ఇంకా కిందకి రాలేకపోయారు.సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చాలా రోజులుగా ఒంటరిగా ఉన్నారు. వాళ్ళను తిరిగి భూమండలానికి తీసుకురావానికి 14 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో నాసా వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

Also Read: Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్‌