Mysterious Illness Kills: పాకిస్థాన్‌లో వింత వ్యాధి.. 16 రోజుల్లో 18 మంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీని అంతుచిక్కని వ్యాధి (Mysterious Illness) హడలెత్తిస్తోంది. కరాచీలోని కెమరి దగ్గర తీరప్రాంతంలోని గోత్ గ్రామంలో వింతవ్యాధితో 18 మంది మరణించగా వారిలో 14 మంది చిన్నారులే ఉన్నట్లు పాక్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ నిర్ధారించారు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నామని, బహుశా సముద్ర నీటి ద్వారా వచ్చి ఉం డొచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 07:25 AM IST

పాకిస్థాన్‌లోని కరాచీని అంతుచిక్కని వ్యాధి (Mysterious Illness) హడలెత్తిస్తోంది. కరాచీలోని కెమరి దగ్గర తీరప్రాంతంలోని గోత్ గ్రామంలో వింతవ్యాధితో 18 మంది మరణించగా వారిలో 14 మంది చిన్నారులే ఉన్నట్లు పాక్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ నిర్ధారించారు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నామని, బహుశా సముద్ర నీటి ద్వారా వచ్చి ఉం డొచ్చని అధికారులు భావిస్తున్నారు. వ్యాధి సోకిన వారు గొంతువాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

పాకిస్తాన్‌లో దుస్థితి మధ్య, ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పుడు ఓ మిస్టరీ వ్యాధి అక్కడి ప్రజల ఇబ్బందులను మరింత పెంచింది. కరాచీలోని కెమారి ప్రాంతంలో ఒక వింత వ్యాధి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దక్షిణ పాకిస్థానీ పోర్ట్ సిటీలోని ఆరోగ్య అధికారులు ఇప్పటికీ మరణాల కారణాన్ని నిర్ధారించలేకపోయారు. జనవరి 10 నుంచి 25 మధ్య కెమారీలోని మవాచ్ గోత్ ప్రాంతంలో వింత వ్యాధి కారణంగా 14 మంది పిల్లలతో సహా 18 మంది మరణించినట్లు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు.

ఈ వింత వ్యాధి కరాచీలోని కెమారీ ప్రాంతంలోని మావాచ్ గోత్‌లో వ్యాపించింది. కేవలం 16 రోజుల్లోనే ఈ వ్యాధి 18 మందిని బలిగొంది. మృతుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉండగా, మరొక వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను అనుమానాస్పద అనారోగ్యంతో కోల్పోయాడు. మవాచ్ గోత్ ఒక మురికివాడ ప్రాంతం. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు లేదా మత్స్యకారులు. ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని మాట్లాడుతూ.. “మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి ఆరోగ్య సేవా బృందం ఇంకా పని చేస్తోంది. అయితే ఈ మరణాలు సంభవించిన గోత్ (గ్రామం) కారణంగా ఇది సముద్ర నీటికి సంబంధించినదని మేము అనుమానిస్తున్నాము.” అన్నారు.

Also Read: Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని మాట్లాడుతూ.. మృతుల కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు మరణానికి ముందు తీవ్ర జ్వరం, గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో వింత వాసన వస్తోందని కూడా కొందరు చెప్పారు. అక్కడి ఫ్యాక్టరీ యజమానులను కూడా విచారించేందుకు అదుపులోకి తీసుకున్నామని కెమారి డిప్యూటీ కమిషనర్ ముఖ్తార్ అలీ అబ్రో తెలిపారు. “మేము ప్రాంతీయ పర్యావరణ ఏజెన్సీని కూడా పిలిపించాము. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మూడు కర్మాగారాల నుండి నమూనాలను ఏజెన్సీ సేకరించింది” అన్నారాయన. సింధ్ సెంటర్ ఫర్ కెమిస్ట్రీ హెడ్ ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీల నుండి సోయాబీన్స్ కొన్ని నమూనాలను కూడా సేకరించామని, సోయా అలర్జీ వల్ల మరణాలు సంభవించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదు కానీ నమూనాలను పరిశీలిస్తున్నామన్నారు.