Site icon HashtagU Telugu

Mumbai Attack 26/11: ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు షాక్..

Mumbai Attack 26/11

Mumbai Attack 26/11

Mumbai Attack 26/11: ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. గతంలో హఫీజ్‌ సయీద్‌ కుమారుడు కమాలుద్దీన్‌ సయీద్‌ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అతని అత్యంత సన్నిహిత సహచరుడు ముఫ్తీ ఖైజర్ ఫారూఖీ హత్యకు గురయ్యాడు. ముఫ్తీ ఖైజర్‌పై కొందరు కాల్పులు జరిపారు.

ముఫ్తీ ఖైసర్ ఫరాఖ్ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు. అతను లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌కు సన్నిహితుడు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ముఫ్తీ కైజర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ముఫ్తీ ఖైజర్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. మూకుమ్మడిగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫుటేజీని బట్టి అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ముఫ్తీ కైజర్ వీధిలో నడుస్తూ కనిపిస్తాడు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి ఉన్నాడు. అతను ఒక చోట ఆగాడు. ఆ తర్వాత కొందరు బైకర్లు వెనుక నుంచి వచ్చి కాల్చి చంపి వెళ్లిపోయారు. ముఫ్తీ ఖైసర్

ముఫ్తీ కైజర్‌పై దాడి చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అలాగే, అతని హత్యకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా గ్రూపు బాధ్యత వహించలేదు. ముఫ్తీ ఖైజర్‌ను హత్య చేయడం వెనుక గుర్తుతెలియని వ్యక్తుల ఉద్దేశం ఏమిటి? దీనిపై విచారణ జరుగుతోంది. ముఫ్తీ ఖైజర్ మరణం మన దేశానికి పెద్ద ఊరటనిచ్చింది. కాగా ముఫ్తీ ఖైసర్ హఫీజ్ సయీద్ కి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గతంలో తన కొడుకు మరియు ఇప్పుడు తన సన్నిహిత సహచరుడిని కోల్పోయినందుకు ఒంటరివాడయ్యాడు.

Also Read: Three Vegetables: ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!