30 Lakh Dogs Killing : 2030లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు మొరాకో దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం ఏకంగా 30 లక్షల వీధి కుక్కలను చంపేందుకు మొరాకో ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటి నుంచే వీధికుక్కలను చంపే ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ఐదేళ్లలో 30 లక్షల వీధి కుక్కలను అంతం చేస్తామని అక్కడి సర్కారు చెబుతోంది. ఫిఫా ఫుట్‌బాల్‌కు మొరాకో ఆతిథ్యం ఇవ్వడం సంగతి బాగానే ఉంది. అయితే ఇన్ని లక్షల కుక్కలను చంపడం అనేది కరెక్టుగా లేదు.
Also Read :TikTok Ban : టిక్‌టాక్‌పై బ్యాన్ అమల్లోకి.. ఆశలన్నీ ట్రంప్ ఆఫర్‌పైనే
చంపాల్సిన అవసరం ఏముందని..
ఆ దేశ ప్రభుత్వం తీరుపై జంతు ప్రేమికులు(30 Lakh Dogs Killing) ఫైర్ అవుతున్నారు. ఫుట్‌బాట్ మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలోకి కుక్కలు ప్రవేశించే అవకాశమే లేనప్పుడు.. వాటిని చంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆయా వీధి కుక్కలను బంధించి.. కనీసం ఇతర నగరాల్లో వదిలేస్తే బాగుంటుందని సాక్షాత్తూ మొరాకో ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. విషపదార్థాలు ఇవ్వడం, కాల్చి చంపడం, ఇనుప రాడ్లతో కొట్టడం వంటి దారుణ పద్ధతుల్లో కుక్కలను చంపడం సరికాదని అంటున్నారు.
Also Read :Weekly Horoscope : జనవరి 19 నుంచి జనవరి 25 వరకు వారఫలాలు.. ఆ రాశి వారికి అప్పులు తీరుతాయ్
రంగంలోకి ఫిఫా
మొరాకో దేశం లక్షలాది కుక్కలను చంపకుండా అడ్డుకోవాలని ఫుట్‌బాల్ పాలక మండలి (ఫిఫా)ను ప్రముఖ జంతు ప్రేమికుడు జేన్ గూడాల్ కోరారు. ఈమేరకు ఆయన ఫిఫాకు బహిరంగ లేఖ రాశారు. ఒకవేళ కుక్కలను చంపితే.. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ కోసం మొరాకోకు ఇచ్చిన అవకాశాన్ని తీసేయాలన్నారు. ఇప్పటికే చాలా కుక్కలను మొరాకోలో చంపినట్లు తెలిసింది. అయినా అక్కడి ప్రభుత్వ సంస్థలు చూసీ చూడనట్టుగా వ్యవహరించాయి. కుక్కల సంతానం పెరగకుండా నిరోధించే వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా మొరాకోలో అంతగా అమలు కావడం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో మొరాకోలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఫిఫా సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు జరిగేే మొరాకో నగరాల్లో కుక్కలను చంపుతున్న ఘటనలపై అది ఆరా తీస్తున్నట్లు సమాచారం.