Site icon HashtagU Telugu

America: అమెరికాలో 2 వేలకుపైగా విమానాలు రద్దు.. కారణమిదే..?

Indian Aviation History

Indian Aviation History

క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా (America) ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అమెరికా (America) అంతటా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్‌ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజారవాణా సేవలకు అంతరాయం కలుగుతుంది. దేశవ్యాప్తంగా భారీగా మంచు కురుస్తుండటంతో పాటు ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్దయ్యాయి.

ట్రాకింగ్ వెబ్‌సైట్ FlightAware ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల వరకు యునైటెడ్ స్టేట్స్‌లో మొత్తం 1,239 విమానాలు రద్దు చేయబడ్డాయి. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 2,270 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందస్తుగా శుక్రవారం సుమారు 1,000 విమానాలను క్యాన్సల్ అయ్యాయి. శనివారం మరో 85 విమానాలను రద్దు చేశారు. గత సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా విమానయాన సంస్థలు చాలా విమానాలు రద్దు చేశాయి. దీని కారణంగా చాలా మంది ప్రజలు తమ ప్రియమైనవారికి దూరంగా ఉంటూ క్రిస్మస్ జరుపుకోవలసి వచ్చింది.

Also Read: Messi picture on currency: అర్జెంటీనా బ్యాంక్ సంచలన నిర్ణయం.. కరెన్సీపై మెస్సీ ఫోటో..!

గురువారం 7400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్‌ నుంచి వచ్చి, పోయే విమానాలే పావు వంతు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువగా ఈ రెండు విమానాశ్రయాల నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక చికాగోలో మూడు గంటల పాటు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు తెలిపారు.
శీతాకాలపు తుఫానుపై నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం మిడ్‌వెస్ట్, ఈశాన్య, ఈస్ట్ కోస్ట్ విమానాశ్రయాలపై ఉంటుందని అంచనా.