Site icon HashtagU Telugu

Ukraine war: యుద్ధంలో 20,000 మంది రష్యా సైనికులు మృతి: US

Ukraine war

New Web Story Copy (62)

Ukraine war: రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆ స్థాయిలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతుంది. నిజానికి ఈ జనరేషన్ చూసిన మొదటి యుద్ధం ఇదే. యూరప్ లో జరిగిన యుద్ధంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రత్యేకంగా చెప్పకోవాలి. రెండు దేశాల ప్రెసిడెంట్ల ఇగో కారణంగా మొదలైన ఈ యుద్ధంలో రష్యా-ఉక్రెయిన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం కోలుకోవాలంటే పది సంవత్సరాలైనా పడుతుంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్రంగా నష్టపోయింది. ఈ వార్ లో వేలాది మంది సైనికులు మరణించారు. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై వైట్ హౌస్ నివేదిక వెల్లడించింది.

తూర్పు ఉక్రెయిన్‌లో ప్రత్యేకించి బఖ్‌ముత్‌లో ఐదు నెలల పాటు సాగిన పోరాటంలో 20,000 మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు మరియు 80,000 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ విలేకరులతో మాట్లాడుతూ… “యుద్ధంలో 100,000 పైగా మరణించారని అయితే బక్ ముత్ లో 20,000 మంది రష్యా సైనికులు మరణించారని అన్నారు. బఖ్‌ముట్ ద్వారా డాన్‌బాస్‌పై దాడి చేసేందుకు రష్యా చేసిన ప్రయత్నం చాలా వరకు విఫలమైంది. రష్యా నిజంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది అని అన్నారు. చనిపోయిన సైనికులలో సగం మంది ప్రైవేట్ మిలిటరీ కంపెనీ వాగ్నర్ చేత నియమించబడ్డారని ఆయన తెలిపారు. అయితే వాగ్నెర్ నాయకుడు మాత్రం అతని బృందంలోని 94 మంది సభ్యులు మాత్రమే ప్రాణనష్టానికి గురయ్యారని అంటున్నారు. కాగా బఖ్ముత్ ప్రాంతం కోసం తీవ్రమైన పోరాటం జరిగిందని అమెరికా పేర్కొంది.

Read More: Nabha Natesh : కుర్రకారుకి ఎద అందాలను ఎరగా వేస్తున్న ఇస్మార్ట్ భామ