Site icon HashtagU Telugu

Mongolia’s Gobi Desert : ఎడారి లో గోళ్ల డైనోసార్ల అవశేషాలు

Largest Fully Preserved Din

Largest Fully Preserved Din

మంగోలియాలోని ప్రసిద్ధ గోబీ ఎడారి..(Mongolia’s Gobi Desert) పురాతన డైనోసార్ అవశేషాల కోసం పేరుపొందిన ప్రదేశం. ఈ ప్రాంతంలో తాజాగా శాస్త్రవేత్తలు (scientists ) రెండు కొత్త రకమైన గోళ్ల డైనోసార్ (Unique two-clawed dinosaur) జాతిని కనుగొన్నారు. వీటిలో ముఖ్యంగా డ్యుయోనైకస్ సొబాటరీ అనే డైనోసార్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ డైనోసార్ తన వెనుక కాళ్లపై నిలబడి, సుమారు 260 కిలోగ్రాముల బరువుతో ఉండేలా అంచనా వేశారు. దీని అత్యుత్తమమైన లక్షణం పొడవైన, వంపు తిరిగిన గోళ్లు, ఇవి తిని బ్రతకడానికి ఉపయోగపడే సాధనాలుగా పనిచేసేవని శాస్త్రవేత్తలు తెలిపారు.

Kashmir : ప్రమాదంలో కాశ్మీర్..అదే జరిగేతే ఎలా…?

ఈ డైనోసార్ వృక్ష సంపదను ఎక్కువగా ఆహారంగా తీసుకునే జీవిగా గుర్తించారు. దీనికి దాని గోళ్లు, బలమైన కాళ్లు సహాయపడేవి. గోబీ ఎడారిలో గతంలోనూ అనేక డైనోసార్ అవశేషాలు వెలుగుచూశాయి, అయితే ఈ కొత్తగా కనుగొన్న జాతి డైనోసార్ల జీవన విధానం గురించి మరింత సమాచారం అందించగలదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో జీవించేందుకు వీటికి ప్రత్యేకమైన శారీరక లక్షణాలు ఉండేవని కూడా పరిశోధనలో తేలింది.

ఈ గోళ్ల డైనోసార్ల గురించి ఇప్పటికే ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్ డొమినియన్లో చూపించిన డైనోసార్లకు ఈ కొత్త డైనోసార్లు సారూప్యంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. తాజా కనుగొన్న ఈ అవశేషాలు, భూతలంలో ఏవిధమైన జీవాలు రాజ్యమేలాయని, వారి అభివృద్ధి ఎలా జరిగిందనే అంశాలకు స్పష్టతనిచ్చే పరిశోధనలకు దారి తీసే అవకాశం ఉంది.