Space Walk : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ మరో ఘన విజయం సాధించింది. ఆ కంపెనీ నిర్వహించిన పోలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా నలుగురు క్రూ సభ్యులు ఇటీవలే ప్రైవేటు స్పేస్ వాక్‌ను నిర్వహించారు. వారంతా ఇవాళ మధ్యాహ్నం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న డ్రైటార్ట్‌గస్ బీచ్‌లో పోలారిస్ డాన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ అయింది. ఆ వెంటనే అందులోని బిలియనీర్ జేర్డ్ ఇస్సాక్‌మన్, పైలట్ స్కాట్ కిడ్‌పోటీట్, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మెనోన్, సారా గిల్లీస్ సురక్షితంగా సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో నలుగురు క్రూ సిబ్బందికి స్పేస్ వాక్ పూర్తి చేయించి, భూమికి తీసుకొచ్చిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ (Space Walk) రికార్డును సొంతం చేసుకుంది.
Also Read :Adani : త్వరలోనే షాకింగ్ వివరాలు.. అదానీ పవర్‌కు కాంట్రాక్టుల కేటాయింపుపై కాంగ్రెస్
- పోలారిస్ డాన్ ప్రాజెక్టులోని నలుగురు క్రూ సిబ్బంది అంతరిక్షంలో ఐదు రోజులు గడిపారు.
- 40 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నారు.
- మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం ఎలా స్పందిస్తుందనేది తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టును స్పేస్ ఎక్స్ వాడుకుంది.
- అంతరిక్ష వాతావరణంలో ఉండగా కిడ్నీల పనితీరు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్‌లో సీపీఆర్ ప్రొసీజర్ వంటివన్నీ చెక్ చేశారు.
- పోలారిస్ డాన్ ప్రాజెక్టు కోసం వాడిన స్పేస్ క్రాఫ్ట్ అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు చేరుకొంది.చంద్రుడిపైకి అపోలో మిషన్ల తర్వాత మానవుడు ఈ స్థాయి ఎత్తుకు చేరడం ఇదే ఫస్ట్ టైం.
- ఇందులోని నలుగురు సిబ్బంది స్పేస్‌వాక్‌ను 740 కిలోమీటర్ల ఎత్తులో నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే ఎక్కువ ఎత్తులో వీరు స్పేస్ వాక్ చేశారు.
- స్పేస్‌వాక్ చేసిన వారిలో ఇస్సాక్‌మన్ 264వ, సారా గిల్ 265వ వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు శ్రీమంతుడు ఇస్సాక్‌మన్ రూ.1600 కోట్ల ట్రావెలింగ్ ఫీజును స్పేస్ ఎక్స్‌కు చెల్లించారు.
- ‘పొలారిస్ డాన్ ప్రాజెక్టు ద్వాారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఫాల్కన్-9 రాకెట్‌ను వాడారు.
- స్పేస్‌ఎక్స్ ప్రత్యేకంగా తయారు చేసిన స్పేస్‌సూట్‌ను ఈ నలుగురు క్రూ సిబ్బంది ధరించారు.