America: అరుదైన గిన్నిస్ రికార్డు సాధించిన మాతృమూర్తి.. 1600 లీటర్ల చనుబాలు దానం?

స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 05:35 PM IST

స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది స్త్రీలకు పిల్లలు కలిగినప్పటికీ పాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో కొంతమంది వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల మందులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ తల్లి పాలను దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. చనుపాలు దానం చేయడము అంటే ఒకటి రెండు లీటర్లు అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఆమె ఏకంగా 1600 చనుపాలను దానం చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్‌ అనే మహిళ ఈ అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి.

ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఒక బిడ్డకు ఎలిసబెత్‌ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని అలాగే కొనసాగించారు. ఇలా ఒకరు ఇద్దరు కాదండోయ్ చాలా మంది శిశువులకు పాలను ఇచ‍్చారు. 2015 నుంచి 2018 వరకు దాదాపుగా 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో ఈమె గిన్నీస్ రికార్డ్ సాధించింది. ఈ అరుదైన గిన్నీస్ రికార్డ్ సాధించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపింది. తన లోపంతో ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని వైద్యులు వెల్లడించారు.