Site icon HashtagU Telugu

12 Hindu Temples: 12 హిందూ దేవాలయాలపై దాడి.. 14 విగ్రహాలు ధ్వంసం

hindu temples

Resizeimagesize (1280 X 720) (1)

బంగ్లాదేశ్‌లోని మతఛాందసవాదులు దేశంలోని హిందూ దేవాలయాలపై (Hindu Temples) దాడులు చేస్తూ రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. తాజాగా ఠాకూర్‌గావ్ జిల్లాలోని 12 హిందూ దేవాలయాలపై దాడులు చేసి, 14 విగ్రహాలను ధ్వంసం చేశారని పోలీస్ అధికారి ఖరుల్ ఆనమ్ తెలిపారు. ఒకటి రెండు కాదు ఏకంగా 14 విగ్రహాలను సంఘ వ్యతిరేకులు ధ్వంసం చేశారు. అదే సమయంలో కేసుకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవానికి, వాయువ్య బంగ్లాదేశ్‌లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున దుండగులు 12 హిందూ దేవాలయాలను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు.

అక్కడి వార్తా సంస్థ ప్రకారం.. ఠాకూర్‌గావ్‌లోని బలియాడంగిలో హిందూ సంఘం నాయకుడు బిద్యనాథ్ బర్మన్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు చీకటి ముసుగులో దేవాలయాలపై దాడి చేసి మూడు గ్రూపులుగా 12 దేవాలయాలలోని 14 విగ్రహాలను పగలగొట్టారని చెప్పారు. ఆలయ స్థలాల్లో ఉన్న కొన్ని విగ్రహాలను పగులగొట్టినట్లు బలియడంగి పూజ ఉత్సవ్ పరిషత్ ప్రధాన కార్యదర్శి బర్మన్ తెలిపారు. ప్రస్తుతం.. మేము వారిని (నేరస్థులను) గుర్తించలేకపోయాము. అయితే ఈ విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

Also Read: Earthquake: టర్కీలో భారీ భూకంపం

హిందూ సంఘం నాయకుడు, సంఘ్ పరిషత్ అధ్యక్షుడు సమర్ ఛటర్జీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం ఎప్పుడూ అద్భుతమైన సర్వమత సామరస్య ప్రాంతంగా పేరు పొందిందని, గతంలో ఇలాంటి దారుణమైన సంఘటన ఇక్కడ జరగలేదని అన్నారు. ముస్లిం సమాజానికి (మెజారిటీ) మాతో (హిందువులతో) ఎలాంటి వివాదం లేదు. అందుకే నిందితులు ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నామని అన్నారు. దుండుగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హిందువులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హిందూ ఆలయాలకు అదనపు రక్షణ కల్పిస్తామని మరో అధికారి అన్నారు.