California: కుర్రాడిలా కనిపించడానికి కోట్లు ఖర్చు చేస్తున్న మిలియనీర్ !

బ్బు ఉంటే చేయలేని పని ఏదీ లేదంటారు. బాగా డబ్బున్న వ్యక్తులు చేసే పనులు వీటికి ఊతం ఇస్తుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Entrepreneur Age Reverse Tr

Entrepreneur Age Reverse Tr

California: డబ్బు ఉంటే చేయలేని పని ఏదీ లేదంటారు. బాగా డబ్బున్న వ్యక్తులు చేసే పనులు వీటికి ఊతం ఇస్తుంటాయి. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఎలాన్ మస్క్ గురించి. ఇటీవల ట్విట్టర్ కొనుగోలు తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అనకున్న దాని కోసం ఎంతకైనా వెళ్ళగలడు అనే పేరు సంపాదించుకున్నాడు ఎలాన్ మస్క్. మాజీ ప్రపంచ కుబేరుడు తన ఆస్తిలో చాలా భాగం ట్విట్టర్ మీదే పెట్టాడు.

ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఒక మిలియనర్. 45 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి 18 సంవత్సరాల వాడిలా మారాలి అనుకుంటున్నాడు. దీనికి సంబంధించిన పని కూడా ప్రారంభించినట్టు సమాచారం. ఈ మొత్తం కల విలువ రెండు మిలియన్ డాలర్లుగా తెలిసింది. ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన కలల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది.

వయసు 45, కానీ 18 ఏళ్ళ వాడిలా ఉండాలట!

ఒక వివరాల్లోకి వెళితే, బ్రయాన్ జాన్సన్ అనే వ్యక్తి అమెరికాలో ఒక మిలియనర్. ఇతను ఉండేది కాలిఫోర్నియాలోని వెనిస్‌ లో. ఇతనికి ఒక కల ఉంది. అదేంటంటే అతని వయసు తగ్గించుకోవాలి అని. దాని కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నాడు.మన మిలియనర్ గారు దాదాపు 16.3 కోట్లు (రెండు మిలియన్‌ డాలర్లు) మేర ఖర్చు చేస్తున్నాడు. అది కూడా సంవత్సరానికి. 18 సమవత్సరాల వయసులో ఉండే శరీర దృఢత్వం అలాగే అవయవాల షేప్ కూడా కావాలట.

ఈ విషయం మీద మంచి అవగాహన తెచ్చుకున్న తరువాత పునరుత్పత్తి మెడిసిన్‌ డాక్టర్‌ ఆలివర్ జోల్మాన్ ని సంప్రదించాడట. ఆ డాక్టర్ గారు కూడా సరే అని చెప్పడంతో ఇద్దరూ దీని మీద తలమునకలు అయ్యారు. ఖర్చు గురించి ఎలాంటి భయం లేకపోవడానికి కారణాలు ఉన్నాయి.బ్రయాన్ జాన్సన్ కి కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి.అతనికి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది అంటున్నారు. అయితే ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, గుండె విషయంలో మంచి అభివృద్ధి వచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన విషయాల మీద పని నడుస్తుంది.

  Last Updated: 26 Jan 2023, 09:44 PM IST