హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఇరాన్ లో షియా మసీదుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దేశ భద్రతతో ఆడుకునే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రకటించారు. దాడి చేసిన వారికి కచ్చితంగా శిక్షపడుతుందని స్థానిక మీడియాతో తెలిపారు. ఇదే దేశ శత్రువుల కుట్రగా పేర్కొంటూ ప్రజలంతా ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు.
కాగా బుధవారం షిరాజ్ నగరంలోని షా చిరాగ్ మసీదుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15మంది పౌరులు మరణించారు. శుత్రువులను ఎదుర్కోవడం మనందరి బాధ్యత అని ఖమేనీ అన్నారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించనందుకు టెహ్రాన్ లో అరెస్టయిన 22ఏళ్ల మెహ్సా అమినీ పోలీస్ కస్టడీలో మరణించిన తర్వాత…ఆందోళన మొదలయ్యాయి. ఖమేనీ ముర్దాబాద్ అంటూ నిరసనలు తెలిపారు.
మసీదుపై దాడికి పాల్పడిన టెర్రరిస్టును పట్టుకున్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్ లో ఇస్లామిక్ స్టేట్ వంటి రాడికల్ సున్నీ ముస్లిం టెర్రిరిస్టు గ్రూపుగా పరిగణిస్తున్న నేపథ్యంలో తక్పిరీ మిలిటెంట్లపై దాడికి అని ఆరోపించింది. ఇరాన్ ను అస్థిరపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేను అమిరబ్డోల్లాహియన్ తెలిపారు.