Emergency Landing: విమానంలో ప్రయాణికుల మధ్య బిగ్ ఫైట్.. రెండుసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్..!

ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing)చేయాల్సి వచ్చింది. క్వీన్స్‌లాండ్‌ నుంచి ఆస్ట్రేలియా (Australia)లోని నార్తర్న్‌ టెరిటరీకి వెళ్తున్న విమానంలో కొందరు ప్రయాణికుల మధ్య గొడవ జరగడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Emergency Landing

Resizeimagesize (1280 X 720) (3)

ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing)చేయాల్సి వచ్చింది. క్వీన్స్‌లాండ్‌ నుంచి ఆస్ట్రేలియా (Australia)లోని నార్తర్న్‌ టెరిటరీకి వెళ్తున్న విమానంలో కొందరు ప్రయాణికుల మధ్య గొడవ జరగడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడంలో విఫలమవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు నివేదికలు తెలిపాయి. ఈ సంఘటన ఏప్రిల్ 20న మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక ప్రయాణీకుల సమూహం ఒక నడవ దగ్గర నిలబడి వారిలో ఒకరు మరొక ప్రయాణికుడిని చంపడానికి గాజు సీసాని పట్టుకున్నట్లు చూపిస్తుంది. ప్రయాణికులు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం కూడా కనిపించింది. నివేదికల ప్రకారం.. గొడవ తర్వాత విమానం రెండు అత్యవసర ల్యాండింగ్‌లు చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల మధ్య వాగ్వాదం తర్వాత క్వీన్స్‌లాండ్‌లో ఇది మొదటి అత్యవసర ల్యాండింగ్ చేసింది.

Also Read: Blue Hole In Mexico: మెక్సికోలో 900 అడుగుల లోతైన “బ్లూ హోల్‌”.. అసలు బ్లూ హోల్ ఎలా ఏర్పడుతుందంటే..?

కొందరు ప్రయాణికులు క్యాబిన్ సిబ్బంది భద్రతా సూచనలను పాటించడంలో విఫలమయ్యారని అభియోగాలు మోపారు. విమానం మళ్లీ టేకాఫ్ అయిన తర్వాత ప్రయాణికుల మధ్య మరో గొడవ జరిగింది. దీంతో తోపులాట జరిగి కిటికీ పగిలింది. ఆ తర్వాత మరోసారి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరోవైపు నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.

  Last Updated: 27 Apr 2023, 08:18 AM IST