Donald Trump: ట్రంప్‌ ఈజ్ బ్యాక్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోకి ఎంట్రీ..!

రెండేళ్ల నిషేధం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. క్యాపిటల్ హిల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా' రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బుధవారం (జనవరి 25) పునరుద్ధరించింది.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 12:04 PM IST

రెండేళ్ల నిషేధం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. క్యాపిటల్ హిల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బుధవారం (జనవరి 25) పునరుద్ధరించింది. జనవరి 6, 2021న US పార్లమెంట్ కాంప్లెక్స్ అంటే క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన తర్వాత 2021 జనవరి 7న డొనాల్డ్ ట్రంప్ ఖాతాను Facebook సస్పెండ్ చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ‘మెటా’ పునరుద్ధరించింది. క్యాపిటల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్‌కు ముగింపు పలికింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. నిబంధనలను మళ్లీ ఎవరూ అతిక్రమించకుండా ఉండేందుకు కొత్త నిబంధనలను జోడిస్తున్నట్లు ‘మెటా’ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తన పోస్ట్ ద్వారా నిబంధనలను మళ్లీ ఉల్లంఘిస్తే, దాని తీవ్రతను బట్టి, అతని ఖాతాను ఒక నెల నుండి రెండేళ్ల వరకు సస్పెండ్ చేయవచ్చని ‘మెటా’ ఆదేశించింది.

Also Read: 50 Killed: నైజీరియాలో బాంబ్ బ్లాస్ట్.. 50 మంది దుర్మరణం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను త్వరలో పునరుద్ధరించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ మంగళవారం ప్రకటించింది. త్వరలో ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరిస్తాం అని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ పునరుద్ధరించబడింది.