300 People Buried : 300 మంది సజీవ సమాధి.. కొండ చరియల బీభత్సం

పెను విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో వాటి కింద నలిగిపోయి దాదాపు 300 మంది సజీవ సమాధి అయ్యారు.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 01:26 PM IST

300 People Buried : పెను విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో వాటి కింద నలిగిపోయి దాదాపు 300 మంది సజీవ సమాధి అయ్యారు. అంతేకాదు ఈ దారుణ దుర్ఘటనలో దాదాపు 1100కుపైగా ఇళ్లు రాళ్లకుప్పలా మిగిలాయి.   పపువా న్యూగినియా దేశంలోని  ఎంగా ప్రావిన్స్‌లో ఉన్న కౌకలం గ్రామంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.  శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడగా.. దాదాపు వందమంది చనిపోయారనే వార్తలు తొలుత వచ్చాయి.  అయితే ఇవాళ అందిన తాజా సమాచారం ప్రకారం.. కొండచరియల కింద నలిగి చనిపోయిన వారి సంఖ్య 300 (300 People Buried) దాటిందని వెల్లడైంది. ఈ ఘటన జరిగినప్పుడు కౌకలం గ్రామంలోని ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. నిద్రలో ఉండగానే ఒకే ఊరికి చెందిన వందలాది మంది ప్రాణాలను కోల్పోవడం విషాదకరం. ఈ ఒక్క ఘటనతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

కొండచరియలు విరిగిపడటంతో కౌకలం గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో హెలికాప్టర్లతో మినహా రోడ్డు మార్గం ద్వారా ఈ ఊరికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ చాలా నెమ్మదిగా జరుగుతోంది. రాళ్లకుప్పలు.. కొండ చరియల శిథిలాల కింద నలిగిపోయిన తమ వారి కోసం ఆప్తులు వెతుక్కుంటున్న సీన్లు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.పపువా న్యూగినియాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది.

Also Read :Gunpowder Factory Blast : గన్‌ పౌడర్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి

155 మంది.. 

తూర్పు ఆఫ్రికా  దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నెల క్రితమే టాంజానియాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 155 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వర్షాల వల్ల 51,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

Also Read :Rave party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు..ఏ2గా ఉన్న అరుణ్‌ కుమార్‌ అరెస్టు