మయన్మార్ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్‌సెన్ జైలులో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 8 మంది మృతి చెందాగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబులు పేలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో 8 మంది మృతి చెందగా.. అందులో 3 జైలు సంబంధిత ఉద్యోగులతో పాటు మరో అయిదుగురు సందర్శకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడికి బాధ్యులు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
బుధవారం ఉదయం 9:40 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) రెండు పార్శిల్ బాంబులు జైలు ప్రవేశద్వారం సమీపంలో పేలాయి. జైలు ఖైదీలకు అధికారులు కేర్ ప్యాకేజీలు అందజేసే భవనంలో ఒక బాంబు పేలింది. మరొకటి జైలు వెలుపల పేలింది. పేలుళ్ల తర్వాత.. జైలు వాచ్‌టవర్ నుండి తుపాకీ కాల్పులు జరిగాయి. పేలుడు జరిగినప్పుడు చాలా మంది ఘటన స్థలంలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
మయన్మార్‌లో ఇన్‌సెన్ జైలు అతిపెద్దది. దీంట్లో సుమారు 10 వేల మంది ఖైదీలు ఉంటారు. జైలులోని పోస్టు రూమ్‌లో బాంబులు పేలినట్లు అధికారులు గుర్తించారు. అయితే అదే రూమ్‌లో ప్లాస్టిక్ బ్యాగ్‌లు చుట్టి ఉన్న మరో బాంబు మాత్రం పేలదు. చనిపోయిన విజిటర్స్‌లో అందరూ మహిళలే ఉన్నారు. రాజధాని యంగూన్ శివారు ప్రాంతంలో ఈ జైలు ఉంది. దీనికి భారీగా భద్రత కూడా ఉంటుంది. .