సోలమన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయ్యింది. బలమైన భూకంపం తర్వాత సోలమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. సోమవారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో సంభవించిన భూకంపంలో 162మంది మరణించారు. ఈ సమయంలోనే సోలమన్ దీవుల్లో భూకంపం సంభవించడం భయాందోళనకు గురిచేస్తోంది.
అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. భూమి కంపించడంతోనే ప్రజలు భయాందోళనతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. సియంజూర్ లోని ఆసుపత్రి పార్కింగ్ లో రాత్రంతా బాధితులతో నిండిపోయింది. తాత్కాలిక టెంట్ల కింద బాధితులు చికిత్స పొందుతున్నారు.
కాగా ఇండోనేషియాలో 2004లో ఏర్పడిన భారీ భూకంపం కోలుకోలేని దెబ్బతీసింది. లక్షలమందిని పొట్టనపెట్టుకుంది. 9.1తీవ్రతతో సంభవించిన భూకంపం 14దేశాలను ప్రభావితం చేసింది.