Sydney Fire Accident: సిడ్నీలో భారీ అగ్ని ప్రమాదం.. నేలకూలిన 7 అంతస్థుల భవనం..

సిడ్నీలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రతరం దాల్చడంతో చుట్టుప్రక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Sydney Fire Accident

New Web Story Copy 2023 05 25t175417.180

Sydney Fire Accident: సిడ్నీలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రతరం దాల్చడంతో చుట్టుప్రక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి. ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో కొద్దీ క్షణాల్లోనే భవనమంతా అగ్నికి ఆహుతి అయింది. దీంతో ఏడంతస్తుల భవనం నేలకూలింది. దీంతో స్థానిక నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు.

సిడ్నీ సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో లేని భవనం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద ఘటనకు సమీపంలో పార్క్ చేసిన కారు కూడా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లో రైలు సేవలు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మరణాలు, గాయపడినట్లు గానీ జరగలేదని న్యూ సౌత్ వేల్స్ పోలీసు ప్రతినిధి తెలిపారు. సమీపంలోని భవనంలోని బాల్కనీలోకి మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More: Mahanadu 2023 : మ‌హానాడుకు ముస్తాబ‌వుతోన్న రాజ‌మండ్రి! లోకేష్ కు ప‌దోన్న‌తి?

  Last Updated: 25 May 2023, 05:54 PM IST