Shooting In America: అమెరికాలో మరోసారి భీకర కాల్పులు.. ఐదుగురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా

అమెరికా (America)లో మరోసారి భీకర కాల్పులు (Shooting) జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Shooting In Philadelphia

Open Fire

అమెరికా (America)లో మరోసారి భీకర కాల్పులు (Shooting) జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. ఘటనను అమలు చేసిన అనంతరం దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఆ వ్యక్తి ఓ ప్రదేశంలో రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా పొరుగువారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో చిన్నారి నిద్రపోయే వేళయిందని, శబ్దాలు చేయవద్దని అతడిని కోరారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి రైఫిల్‌తో బయటకు వచ్చి తన పొరుగువారిని దగ్గర నుంచి కాల్చడం ప్రారంభించాడని అధికారులు తెలిపారు.

శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ అధికారులు క్లేవ్‌ల్యాండ్ నుండి ఈ సంఘటనకు సంబంధించి కాల్ అందుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పలువురిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. వారిలో కొందరు మరణించారు కూడా. శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ గ్రెగ్ కేపర్స్ ప్రకారం.. ఇంట్లో 10 మంది వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒకరు పురుషుడు. దీంతో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. బాధితుల్లో 8 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నట్లు కేపర్స్ తెలిపారు. ఈ దాడిలో 8 ఏళ్ల చిన్నారి, ఇంట్లో ఉన్న మరో నలుగురు వ్యక్తులు మరణించారు.

Also Read: Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 350 మంది భారతీయులు.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..?

కాల్పులు జరిపిన వ్యక్తి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. నిందితుడు మెక్సికో వాసి అని ప్రాథమిక సమాచారం. ఇప్పుడు నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని పట్టుకునే వరకు ఇంట్లోని వారిని లోపలే ఉండాలని కోరారు. గతంలో అమెరికాలోని ఉటాలో కాల్పుల ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఇంతకు ముందు కూడా అమెరికాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 174 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

  Last Updated: 30 Apr 2023, 06:53 AM IST