Mark Zuckerberg : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందు తన ప్రభుత్వం కోసం ట్రంప్ చాలా సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న తన ప్రభుత్వాన్ని నడిపేందుకు ఒక సహాయ నిధిని ఆయన ఏర్పాటు చేశారు. దానికి భారీగా విరాళాలు వస్తున్నాయి. దీనికి డొనేషన్స్ ఇచ్చిన వారి లిస్టులో తాజాగా ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేరిపోయారు.
Also Read :600 Diamonds Crown : స్వామివారిపై ముస్లిం డ్యాన్సర్ భక్తి.. 600 వజ్రాలతో కిరీటం
ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సహాయ నిధికి జుకర్‌బర్గ్ ఏకంగా రూ.8,486 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ విరాళం ఇచ్చేందుకు జుకర్‌బర్గ్ నేరుగా ట్రంప్ నివాసానికి వెళ్లారు. ట్రంప్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఈ విరాళంపై ఆయన అనౌన్స్‌మెంట్ చేశారు. తన నివాసంలో జుకర్‌బర్గ్‌కు(Mark Zuckerberg) ట్రంప్ విందు ఇచ్చారు. ట్రంప్ పాలనా కాలంలో తీసుకురాబోయే టెక్ పరమైన నిర్ణయాలు ఫేస్‌బుక్, మెటా సంస్థలకు ఇబ్బంది కలిగించని రీతిలో ఉండాలని జుకర్‌బర్గ్ కోరినట్లు తెలిసింది. అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తమ కంపెనీ డిమాండ్లను నెరవేర్చేందుకు ట్రంప్ రెడీ అయినందు వల్లే జుకర్ బర్గ్ ఇంత భారీ విరాళం ఇచ్చారని అంటున్నారు.
Also Read :Sai Pallavi Vs Vegetarian : ‘‘నేను మాంసాహారం మానేశానా ?’’.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. చెవిలోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తమోడుతున్నా ట్రంప్ పిడికిలి బిగించి ‘ఫైట్’ అని నినదించారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన ఒక ఫొటోపై అప్పట్లో జుకర్‌బర్గ్ స్పందించారు. ‘‘నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం అది. ఒక అమెరికన్‌గా ఎవరైనా ఆ పోరాటంతో భావోద్వేగానికి గురికావాల్సిందే. అందుకేనేమో చాలామంది ట్రంప్‌ను ఇష్టపడతారు’ అని జుకర్ బర్గ్ కొనియాడారు. మొత్తం మీద మొదటి నుంచీ ట్రంప్‌తో జుకర్ బర్గ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌కు ఏకంగా ప్రభుత్వంలో కీలక పదవిని ట్రంప్ కేటాయించారు.