Site icon HashtagU Telugu

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సంస్థ..!

Mark Zuckerberg

Mark Zuckerberg 2

ప్రముఖ (మెటా) ఫేస్‌బుక్ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. జుకర్‌బర్గ్ వచ్చే ఏడాది కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు కథనాలు పేర్కొన్న దానిపై సంస్థ స్పందించింది. మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. అది అవాస్తమని కొట్టిపారేసారు. జుకర్‌బర్గ్‌ వచ్చే ఏడాది రాజీనామా చేస్తారని వార్తలు అబద్ధమని ఆండీ స్టోన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

మెటా (గతంలో ఫేస్‌బుక్) దాని సహ వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ వచ్చే ఏడాది రాజీనామా చేయరని స్పష్టం చేసింది. నష్టాన్ని కలిగించే మెటావర్స్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిని రెట్టింపు చేయాలనే తన ప్రణాళికలతో పెట్టుబడిదారుల నిరాశ కారణంగా జుకర్‌బర్గ్ వచ్చే ఏడాది కంపెనీ నుండి నిష్క్రమిస్తారని ఒక నివేదిక పేర్కొన్న తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

మెటా కూడా గత రెండు త్రైమాసికాల్లో ఆదాయానికి గండి పడింది. రాబోయే మూడు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ది లీక్ కథనం తర్వాత మెటా షేర్లు 1 శాతం పెరిగాయి. Meta ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13 శాతం మందిని తొలగించింది. దాదాపు 11,000 ఉద్యోగులను తొలగించటం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.