Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్‌బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను దాటేశాడు. దీంతో ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా జుకర్‌బర్గ్ నిలిచాడు. అమెరికా స్టాక్ మార్కెట్‌లో మెటా(ఫేస్ బుక్) షేరు ధర ఒక్కసారిగా 22 శాతం పెరగడంతో ఈ భారీ మార్పు చోటుచేసుకుంది. షేరు ధర 22 శాతం పెరగడంతో జుకర్ బర్గ్ సంపదలో మరో రూ.2 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో ఆయన మొత్తం సంపద విలువ 13 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక బిల్ గేట్స్ మొత్తం సంపద విలువ ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లు. ప్రస్తుతానికి సంపద విషయంలో ప్రపంచంలో జుకర్‌బర్గ్ కంటే ధనవంతులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు ఎవరంటే.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ . జుకర్ బర్గ్(Mark Zuckerberg Vs Bill Gates) ప్రస్తుతం మెటా కంపెనీ సీఈవో హోదాలో ఉన్నారు. ఆయన వద్ద దాదాపు 35 కోట్ల క్లాస్ A, క్లాస్ B షేర్లు ఉన్నాయి. మెటా కంపెనీ తమ మొట్టమొదటి డివిడెండ్‌ను మార్చిలో చెల్లించినప్పుడు దాదాపు రూ.1400 కోట్ల నగదును డివిడెండ్ రూపంలోనూ అందుకుంటారు, Meta కంపెనీ దాని 50-సెంట్ త్రైమాసిక డివిడెండ్‌ను కొనసాగిస్తే .. ఆ రూపంలో ప్రతి సంవత్సరం మరో రూ.5,700 కోట్లను మెటా సీఈవో ఖాతాలో జమ అవుతాయి.
We’re now on WhatsApp. Click to Join
ఎకానమీ క్లాస్‌లోనే బిల్‌గేట్స్ జర్నీ
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పనిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తుంటారు. పైగా అవి పెద్ద ఖరీదైనవి కూడా కాదు. ఈ కోవకు చెందినవారే యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్.మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు కు సంబంధించి కూడా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ ఇటీవల వెల్లడించారు. బిల్‌గేట్స్ చాలా కాలం పాటు విమానంలో సామాన్యులు ప్రయాణించే ఎకానమీ క్లాస్‌లోనే వెళ్లేవారని మార్క్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిజినెస్ క్లాస్ టికెట్‌కొనే స్తోమత ఆయనకు ఉన్నప్పటికీ.. దానికి చెల్లించే డబ్బులకు.. పొందే సేవ, సదుపాయాలకు పొంతన ఉండేది కాదని గేట్స్ అభిప్రాయం! ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికంగా చెల్లిస్తున్నప్పటికీ.. సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండేవి కాదని ఆయన భావించేవారట. పైగా ఏ క్లాస్‌లో ప్రయాణించినా.. చివరకు అందరూ ఒకే సమయానికి, ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నప్పుడు అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏముందని అనేవారట. ఈ విషయాన్ని మార్క్ ‘ఎక్స్ (ట్విటర్)’లో పోస్ట్ చేశారు. విమానంలో బిల్ గేట్స్ ఎకానమీ క్లాస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న ఓ పాత ఫొటోను కూడా జత చేశారు.