Site icon HashtagU Telugu

lost $100 billion: 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టం.. ఎవరికంటే..?

Zuckerberg

Meta Mark

మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 136.4 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్క్ నికర ఆదాయం 74 శాతం క్షీణించి 38.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో గతేడాది ప్రపంచ ధనికుల్లో మూడో స్థానంలో ఉన్న మార్క్ ఈ ఏడాది 28వ స్థానానికి పడిపోయారు. ఈ ఒక్క ఏడాది 676 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఆయన నమోదు చేశారు.

మార్క్ జుకర్‌బర్గ్ గత 13 నెలల్లో అతని నికర విలువ $100 బిలియన్లకు పైగా క్షీణించింది. ఎందుకంటే అతని కంపెనీ మెటా స్టాక్ ధర గురువారం భారీగా నష్టపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జుకర్‌బర్గ్ నికర విలువ సుమారు $37 బిలియన్లుగా ఉంది. ఒక దశలో మెటా షేర్ ధర గరిష్ట స్థాయికి చేరడంతో 2021 సెప్టెంబర్ లో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 142 బిలియన్ డాలర్లు ఉండేది. అంటే సుమారు 11 లక్షల కోట్ల సంపద ఉండేది. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 74 శాతం అంటే 100 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. నాలుగింట మూడొంతుల సంపద కోల్పోయారు.

2020 మేలో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తి. ప్రస్తుతం టెస్లా CEO ఎలాన్ మస్క్ బిలియనీర్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ నుండి గట్టి పోటీ కారణంగా ప్రకటనల అమ్మకాలు పడిపోవడంతో కంపెనీ పోరాడుతున్నందున వరుసగా రెండవ త్రైమాసికంలో ఆదాయం పడిపోయిందని మెటా ప్రకటించింది.