Site icon HashtagU Telugu

Pakistan : ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి వీడియో వైరల్..!! పాకిస్తాన్ నిజమైన హీరో అంటూ ప్రశంసలు..!!

Pakistan (1)

Pakistan (1)

పాకిస్తాన్ లో గురువారం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పించుకున్నారు. బుల్లెట్ కాలుకు తగలడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పంజాబ్ ప్రావిన్స్ లో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఓ వ్యక్తి చురుకుదనంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

నిందితుడు ఆకస్మాత్తుగా దూసుకువచ్చి కాల్పులు జరుపుతున్నాడు. అతని పక్కనే ఓ వ్యక్తి నిందితుడి చేతిలో నుంచి తుపాకీని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ నిందితుడి లక్ష్యం తప్పింది. తుపాకీ గురి తప్పడంతోనే ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయం అయ్యింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని పిటిఐ పేర్కొంది. తుపాకీ కిందపడేసిన నిందితుడు పారిపోతుండగా…అతన్ని వెంబడించాడు. ఆ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలు కాపాడిన వ్యక్తిని మద్దతుదారులు ప్రశంసించారు. నువ్ హీరోవి అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్ నిజమైన హీరో అంటూ ట్విట్టర్ లో నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.