Site icon HashtagU Telugu

Maldives: మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం

President Muizzu

President Muizzu

Maldives: మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజూను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముయిజా ప్రభుత్వం కూలిపోయి ప్రమాదం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదునుచూసి ముయిజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

వాస్తవానికి మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంతో విభేదాల కారణంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య పార్లమెంట్‌లో తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ లో గందరగోళం జరగడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) మహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డెమోక్రాట్‌లతో పాటు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రతిపాదనకు మద్దతును పొందినట్లు సమాచారం. ప్రతిపక్షాల ఐక్యత దృష్ట్యా, ఈ సంక్షోభాన్ని అధిగమించడం మహమ్మద్ ముయిజు ప్రభుత్వానికి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదే సమయంలో అధ్యక్షుడు ముయిజా భారత ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని పట్టుపడుతున్నాయి. భారత్ పైన, నరేంద్రమోదీ మీద చేసిన వ్యాఖలు మూలంగా మాల్దీవులు చాలా నష్టపోయాయని ప్రతిపక్షపార్టీలు మండి పడుతున్నాయి.. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని మాల్దీవుల జంహూరీ పార్టీ నాయకుడు కాసిం ఇబ్రహీం మహ్మద్ ముయిజుకు సూచించారు. మాల్దీవులలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, చైనా అనుకూల మహ్మద్ ముయిజూ భారతదేశంతో తన సంబంధాల పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరాడు. దీని తర్వాత, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, మాల్దీవులతో పోల్చడంతో మహమ్మద్ ముయిజు మంత్రుల అనుచిత వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచాయి. దీంతో భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకోవడంతో మాల్దీవులు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇది కాకుండా, చైనా గూఢచారి నౌక మాల్దీవుల పర్యటనకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read: KCR: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే: కేసీఆర్

Exit mobile version