Black Magic On Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి.. మంత్రి అరెస్ట్‌..!

  • Written By:
  • Updated On - June 28, 2024 / 10:48 AM IST

Black Magic On Muizzu: మాల్దీవుల్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌ మ్యాజిక్‌ చేశారనే ఆరోపణలపై ప్రెసిడెంట్‌ మహ్మద్‌ ముయిజ్జూ (Black Magic On Muizzu) క్యాబినెట్‌ మంత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందిన సమాచారం ప్రకారం.. అధ్యక్షుడిపై చేతబడి చేసినందుకు మాల్దీవుల పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఫాతిమా షమానాజ్‌తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. షమ్నాజ్ అరెస్టుకు ముందు పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి చేత‌బ‌డి చేయడానికి ఉపయోగించే అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అందరినీ 7 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు.

బ్లాక్ మ్యాజిక్ ఎందుకు జరిగింది?

కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఫాతిమా షమ్నాజ్ ముయిజ్జుకు దగ్గరవ్వడానికి మంత్రవిద్య చేసింది. ప్రెసిడెంట్ ముయిజుపై ఫాతిమా షమ్నాజ్ చేతబడి చేయడం గురించి అనేక వార్త‌లు వెలువడుతున్నాయి. షమ్నాజ్‌పై బ్లాక్ మ్యాజిక్ చేయడం ద్వారా ప్రెసిడెంట్ ముయిజ్జూ మంచి పుస్తకాలలోకి రావాలని షమ్నాజ్ కోరుకుందని, ఆమె ముయిజ్జు ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిని పొందాలనుకుందని కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అందుకే ఆమె చేతబడి సహాయం తీసుకుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Also Read: Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

షమ్నాజ్ ఎవరు?

పర్యావరణ మంత్రి కాకముందు షమ్నాజ్ మాలే సిటీ కౌన్సిల్‌లోని హెన్వీరు సౌత్ కౌన్సిలర్‌గా ఉన్నారు. ముయిజు ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టేందుకు ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. అంతకుముందు ఆమె అధ్య‌క్షుడి కార్యాలయంలో కూడా ఒక ముఖ్యమైన పదవిని నిర్వహించారు. ఆమె ముయిజు, అతని భార్యతో సన్నిహితంగా ఉండే సీనియర్ అధికారి అయిన ఆడమ్ రమీజ్ మాజీ భార్య.

We’re now on WhatsApp : Click to Join