Site icon HashtagU Telugu

Maldives : మీరొస్తేనే మేం బతకగలం… మాల్దీవుల పశ్చాత్తాపం

Foreign Minister Moosa Zame

Foreign Minister Moosa Zame

మీరొస్తేనే మేం బతకగలం..దయచేసి మీరంతా మా వద్దకు రండి ..అంటూ మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ పయనం అవుతున్నారు. అంతకు ముందు వరకు మాల్దీవులకు వెళ్లే వారు కానీ భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు మాల్దీవుల విదేశాంగ మంత్రి చేయడం తో అప్పటి నుండి మాల్దీవులను బైకాట్ చేసారు. సినీ ప్రముఖులతో పాటు చాలామంది భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం మానేసేసరికి..వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే విషయాన్ని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ (Foreign Minister Moosa Zameer) తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరిలో చేపట్టిన లక్షద్వీప్ పర్యటనపై తమ మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలను పునరావృతం కానివ్వబోమంటూ హామీ ఇచ్చారు. తాజాగా మూసా జమీర్‌ భారత పర్యటనకు వచ్చారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..‘మా వాళ్లు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదని ఇప్పటికే స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఈ విషయంలో తలెత్తిన అపార్థాల దశను దాటేశాం. ఇరు దేశాల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

Read Also : AP CID : వైసీపీకి తొలిసారి ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది