న్యూ కలెడోనియాలో శుక్రవారం బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ప్రకంపనల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియాకు ఆగ్నేయంగా ఉన్న లాయల్టీ ఐలాండ్‌లో భూకంపం (Earthquake) సంభవించినట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ సమాచారాన్ని ఇచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు USGS తెలిపింది. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
భూకంపాలు ఎందుకు వస్తాయి..?
భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం.. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.