Site icon HashtagU Telugu

PM Modi Greece: గ్రీస్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఘనస్వాగతం పలికిన భారతీయులు..!

PM Modi Greece

Compressjpeg.online 1280x720 Image 11zon

PM Modi Greece: బ్రిక్స్‌ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్‌ (PM Modi Greece) చేరుకున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చేస్తున్న పర్యటన ఇది. ఈ సందర్భంగా గ్రీస్‌లో ఘన స్వాగతం లభించింది. హోటల్ గ్రాండే బ్రెటాగ్నే వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ సమాజం ‘భారత్ మాతా కీ జై,’ ‘మోదీ, మోదీ’ అనే నినాదాలతో ఘనస్వాగతం పలికింది.

భారతీయ సమాజానికి చెందిన ప్రజలు నినాదాలు

ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత PM మోడీ ఏథెన్స్‌లోని హోటల్ గ్రాండే బ్రెటాగ్నే చేరుకున్నారు. అక్కడ భారతీయ ప్రవాసులు చేతిలో త్రివర్ణ పతాకంతో బయట వేచి ఉన్నారు. కమ్యూనిటీ ప్రజలు డ్రమ్స్ వాయిస్తూ ప్రధాని మోదీకి స్వాగతం పలికి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లలో ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం.

భారతీయ సమాజంలోని ప్రజలు చూపిన ఉత్సాహం

గ్రీస్‌లోని ఏథెన్స్‌కు ప్రధాని మోదీ రాకపై భారతీయ సమాజం సంతోషం వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయులలో ఒకరు మాట్లాడుతూ.. “ప్రధాని మోదీ ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ల తర్వాత ప్రధాని వచ్చారు. చివరిసారి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గ్రీస్‌కు చేరుకున్నారు. నరేంద్ర మోడీ గత 9 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నారు” మంచి పేరు వెలుగులోకి వచ్చింది. PM మోడీ వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.” అని అన్నారు.

Also Read: National Film Awards: జై భీమ్ కు దక్కని జాతీయ అవార్డు, జ్యూరీపై తమిళ్ ఫ్యాన్స్ ఫైర్ 

గ్రీస్‌లో ప్రధాని మోదీ కీలక చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, షిప్పింగ్ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటీకరించడంలో భారతదేశ సహాయాన్ని పొందాలని గ్రీస్ భావిస్తోంది. దీంతో ఐరోపాలోకి ఇండియా అడుగుపెట్టేందుకు గ్రీస్‌ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగపడనుంది.

గ్రీస్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ ఈ పర్యటన చారిత్రక ప్రాముఖ్యతను వెల్లడించారు. ప్రధాని మోదీ, గ్రీస్ అగ్ర నాయకత్వం మధ్య జరగనున్న తదుపరి సమావేశాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పీపుల్‌-టూ-పీపుల్‌ ఎంగేజ్‌మెంట్‌, సెక్యూరిటీపై ప్రధాన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు.