Lybya: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి

  • Written By:
  • Updated On - April 1, 2024 / 11:07 AM IST

Attack on Libya PM Residence: శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియా (Libya)లో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా(Prime Minister Abdul Hamid Al Dabeja)నివాసంపై నిన్న రాకెట్ గ్రనేడ్ దాడి(Rocket Grenade Attack) జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి.

2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది. 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ ఏడాది చివరికి తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడమే దీనికి కారణం. దీంతో అప్పటి నుంచి లిబియాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.

కాగా, సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్నున్న ఎన్నికల నిర్వహణను సజావుగా చేపట్టేలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దేశంలోని ముగ్గురు కీలక నేతలు మార్చి ఆరంభలో అంగీకరించారు. కానా, ప్రధాని మాత్రమే ఎన్నికలు జరిగే వరకు పదవి నుండి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

Read Also:  Venu Swamy: ఇదేందయ్యా ఇది.. భార్యతో కలిసి రీల్స్ చేసిన వేణు స్వామి?