Viral Video: ఆవుతో యుద్ధానికి దిగిన చిరుత.. గెలుపు ఎవరిదంటే?

సాధారణంగా వేటాడే జంతువులు అనగానే మనకు పులి,సింహం, చిరుత పులి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవి జంతువులను వేటాడి తినడంలో ఎంతో తెలివి ప్రదర్శిస్తూ ఉంటాయి. మాటు వేసి వేటాడటంలో వాటికి అవే సాటి అని చెప్పవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Viral Video

Viral Video

సాధారణంగా వేటాడే జంతువులు అనగానే మనకు పులి,సింహం, చిరుత పులి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవి జంతువులను వేటాడి తినడంలో ఎంతో తెలివి ప్రదర్శిస్తూ ఉంటాయి. మాటు వేసి వేటాడటంలో వాటికి అవే సాటి అని చెప్పవచ్చు. ఇతర జంతువులను ఒక్కసారి వేటాడటం మొదలుపెట్టాయి అంటే వాటిని ఒక పట్టు పట్టే వరకు విడిచిపెట్టవు. ఏవో కొన్ని సందర్భాలలో మాత్రమే అవతలి జంతువుల అదృష్టం కొద్ది అవి బయట పడుతుంటాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక ఆవు, చిరుత పులి మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో చిరుత పులి కీ ఒక ఆవు చిక్కగా దొరికింది కదా అని ఆ చిరుత దాని దవడ బలం మొత్తం ఉపయోగించి ఆవును, చాలా సేపు గట్టిగా పట్టుకుంది. ఆవు కూడా చిరుతపులి నుంచి తప్పించుకోవడానికి బాగానే ప్రయత్నించింది.

కానీ చిరుత పులికి ఎక్కువ స్టామినా ఉండడంతో ఈ పోరాటంలో చివరికి చిరుత పులి గెలిచింది. అంతటితో ఆగకుండా ఆ ఆవును పులి అడవిలోకి లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ ఆవు పట్ల జాలిని చూపిస్తున్నారు.

  Last Updated: 25 Sep 2022, 10:23 AM IST