Shock To Hafiz Saeed : లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌ మరో అనుచరుడి మర్డర్

Shock To Hafiz Saeed : భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో ఒక్కరొక్కరిగా మర్డర్‌కు గురవుతున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Shock To Hafiz Saeed

Shock To Hafiz Saeed

Shock To Hafiz Saeed : భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో ఒక్కరొక్కరిగా మర్డర్‌కు గురవుతున్నారు.  2015లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) కాన్వాయ్‌పై దాడికి సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తైబా ఉగ్రవాది హంజ్లా అద్నాన్ పాకిస్థాన్‌లోని కరాచీలో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని హతమార్చారు. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అద్నాన్ సన్నిహితుడు.  డిసెంబరు 3న హంజ్లా అద్నాన్‌పై కాల్పులు జరగగా.. శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలపాలై రక్తమోడుతున్న అతడిని వెంటనే పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కరాచీలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. హంజ్లా అద్నాన్‌ డిసెంబర్ 5న మరణించాడు. ఇటీవల హంజ్లా అద్నాన్ తన టెర్రరిస్ట్ ఆపరేషన్ స్థావరాన్ని రావల్పిండి నుంచి కరాచీకి మార్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

2015 సంవత్సరంలో ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి హంజ్లా అద్నాన్‌ పథక రచన చేశాడు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్ సైనికులు అమరులయ్యారు. 13 మంది జవాన్లు గాయపడ్డారు. 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ హంజ్లా అద్నాన్‌ హస్తం ఉంది. ఈ దాడిలో 8 మంది CRPF సైనికులు అమరులయ్యారు. 22 మంది గాయపడ్డారు. పాక్‌లో కొత్తగా రిక్రూట్ చేసిన ఉగ్రవాదులను హంజ్లా అద్నాన్‌ ట్రైనింగ్ ఇచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌కు(Shock To Hafiz Saeed) పంపేవాడు.

Also Read: Parliament Attack : డిసెంబరు​ 13కల్లా పార్లమెంటుపై​ దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ ​పన్నూ వార్నింగ్

  Last Updated: 06 Dec 2023, 12:27 PM IST