Site icon HashtagU Telugu

Venezuela Landslide : కొండచరియలు విరిగిపడి..22 మంది మృతి, 50 మందికి పైగా గల్లంతు..!!

Venezuela

Venezuela

వెనిజులాలో వరుసగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ వెనిజులాలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలియజేసారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ వెనిజులాలోని ఐదు చిన్న నదులు పొంగిపొర్లుతున్నాయని వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా పర్వతాల నుండి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు, శిధిలాలు కొట్టుకుపోయాయని, వ్యాపారాలు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని రోడ్రిగ్జ్ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. గ్రామంలోని తాగునీటి వ్యవస్థను ఆపరేట్ చేయడానికి ఉపయోగించే పంపులు వరద నీటిలో కొట్టుకుపోయాయని తెలిపారు.

నగరం అంతటా మట్టి, రాళ్ల కింద చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోడ్రిగ్జ్ చెప్పారు. ఆర్మీ, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. తేజేరియాస్ నగరంలో జరిగిన ఘటన విషాదకరమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ ప్రాంతంలో బాధితుల కోసం వెయ్యి మంది రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయని ఆ దేశ పౌర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి కార్లోస్ పెరెజ్ ఆదివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆదివారం ఉదయం వర్షం కారణంగా మరో మూడు సెంట్రల్ రాష్ట్రాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రోడ్రిగ్జ్ చెప్పారు. ఇటీవలి వారాల్లో లా నియా వాతావరణ నమూనా కారణంగా భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య కనీసం 40కి పెరిగింది.