Site icon HashtagU Telugu

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్‌లోని అడియాలా జైలు వెలుపల ప్రజల కదలికలు పెరిగాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)ను కలవడానికి అడియాలా జైలుకు చేరుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది ఆయనను జైలు వెలుపలే నిలిపివేశార. దీంతో అక్కడ గందరగోళం మొదలైంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణం గురించి సోషల్ మీడియాలో పుకార్లు వేగవంతమైన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఆరోగ్యం సరిగా లేదని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ హత్యపై సస్పెన్స్ మరింతగా

సోహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. “నేను ఒక ప్రావిన్స్‌లోని 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రిని. ఏడవసారి ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి వచ్చాను. దీని వల్ల విద్వేషం పెరగదా? నన్ను ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ఎందుకు అనుమతించడం లేదు?” అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో గురువారం (నవంబర్ 27) సాయంత్రం 5:30 గంటలకు నేషనల్ అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మరణంపై సస్పెన్స్ మరింత పెరుగుతోంది.

Also Read: Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

జైలు వెలుపలే ధర్నాకు దిగిన సోహైల్ అఫ్రిది

ఖైబర్ పఖ్తూన్ఖ్వా (KPK) ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో కలవడానికి నిరాకరించడంతో ఆయన జైలు వెలుపలే ధర్నాకు కూర్చున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోహైల్ అఫ్రిది వారి పార్టీకి చెందిన ఏకైక ముఖ్యమంత్రి.

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గత కొద్ది రోజులుగా అడియాలా జైలు వెలుపల నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు ఇప్పుడు పాకిస్తాన్‌లోని ఇతర నగరాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కుటుంబం, పీటీఐ మద్దతుదారులు, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు జైలులో ఆయనను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులపై పోలీసుల దాడి

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులను కూడా ఆయనను కలవడానికి అనుమతించలేదు. దీంతో వారు అడియాలా జైలు వెలుపల ధర్నాకు దిగారు. ఆయన సోదరీమణులు నౌరీన్ నియాజీ, అలీమా ఖాన్, డా. ఉజ్మా ఖాన్, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) ఇతర సభ్యులతో కలిసి జైలు వెలుపల కూర్చున్నారు. ఈ సమయంలో పోలీసులు వారిపై దాడి చేసి, వారిని దారుణంగా కొట్టారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని డిమాండ్ చేయడం కార్యకర్తల నేరమా అని పార్టీ ప్రశ్నించింది.

Exit mobile version