Site icon HashtagU Telugu

King Charles: కరెన్సీ నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

King Charles Banknotes 02 Superjumbo

King Charles Banknotes 02 Superjumbo

King Charles: అన్ని దేశాలు తమ కరెన్సీ నోట్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటాయి. కొత్త కొత్త డిజైన్లలో కరెన్సీ నోట్లను, కాయిన్స్‌ను తీసుకొస్తాయి. తమ దేశంలోనే ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, భవంతులను కరెన్సీ నోట్లపై ముద్రిస్తూ ఉంటారు. ఇలా కొత్త వ్యక్తుల ఫొటోలు, ప్రదేశాలతో కొత్త నోట్లను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇండియాలో కరెన్సీ నోట్లపై మహత్మాగాంధీ ఫొటోలు ఉన్నట్లుగానే.. ఇతర దేశాల్లో కూడా వారి దేశాలకు విశేష సేవలందించిన వారి ఫొటోలతో నోట్లను తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్ చార్లెస్ 111 ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లను తీసుకురానుంది. 2024 మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. మంగళవారం దీనికి సంబంధించి డీజైన్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తాజాగా విడుదల చేసింది. కింగ్ చార్లెస్ ఫొటోతో తీసుకురానున్న కరెన్సీ నోట్లకు సంబంధించి డిజైన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన ఫొటోతో ఒక కాయిన్ ను కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ విడుదల చేసింది.

ప్రస్తుుతం ఉన్న డిజైన్ లలో ఎలాంటి మార్పు ఉండదని, కేవలం ఫొటో మాత్రమే మారుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్పష్టం చేసింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పాత నోట్లను వాడుకోవచ్చని తెలిపింది. క్వీన్ ఎలిజబెత్ ఫొటోతో కూడిన పాత పాలిమర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని, ఎలా ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. 5,10,20,50 పౌండ్ల పాలిమన్ నోట్లను మాత్రమే కింగ్ చార్లెస్ 111 చిత్రంలో ఇంగ్లండ్ తీసుకురానుంది. క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో కుమారుడు చార్లెస్-3రాజు అయ్యాడు. బ్రిటన్ లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముంద్రించడం అనేది అనవాయితీగా వస్తోంది.