Site icon HashtagU Telugu

Charles III is the King:లండన్‌ కొత్తరాజుగా ప్రమాణం చేసిన ఛార్లెస్‌-3

King Charles Imresizer

King Charles Imresizer

లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో అక్సెషన్‌ కౌన్సిల్‌ సమక్షాన కింగ్‌ ఛార్లెస్‌-3ను బ్రిటన్‌కు కొత్తరాజుగా రాజరికపు అధికారాలు కట్టబెట్టారు. గురువారం క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, యువరాజు ఛార్లెస్‌-3 రాజుగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించిన వ్యక్తిగా ఛార్లెస్‌ నూతన అధ్యాయం లిఖించారు. అయితే, ఇందుకు పెద్ద క్రతువే జరుగుతోంది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించారు. ‘రాణి అస్తమయంతో ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ ఆర్థర్‌ జార్జ్‌ ఇప్పుడు కొత్త రాజు (ఛార్లెస్‌-3) అయ్యారు’ అని కౌన్సిల్‌ ప్రకటించింది. ఈ సమయంలో ఆయన వెంట క్వీన్‌ కాన్సార్ట్‌ కెమిల్లా, ఆయన కుమారుడు విలియం ఉన్నారు.