Powerful Sister: కిమ్ యో జోంగ్ .. ఈ పేరును చూసి గుర్తుపట్టే ఉంటారు. ఈమె ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి. సోదరుడిలాగే కిమ్ యో జోంగ్ కూడా చాలా డేంజర్ అండ్ పవర్ ఫుల్. తాజాగా అమెరికా, దక్షిణ కొరియాలకు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని రెచ్చగొడితే ఊరుకునేది లేదని కిమ్ యో జోంగ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి కవ్వింపులను ఇలాగే కొనసాగిస్తే ఉత్తర కొరియాలో ఆయుధ పరీక్షలను మరింత తీవ్రతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాపై దాడికి సన్నాహాలుగా భావిస్తామని కిమ్ యో జోంగ్ తేల్చి చెప్పారు.
Also Read :Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
యుద్ధమే మొదలైతే ఎంతకైనా తెగిస్తాం
‘‘అమెరికాలో ప్రభుత్వం మారినా, ఆ దేశం విధానాలు మారలేదు. యుద్ధాన్నే అమెరికా కోరుకుంటోంది. యుద్ధమే మొదలైతే మేం ఎంతకైనా తెగిస్తాం. దీనివల్ల కొరియా ద్వీపకల్పం మంటల్లో చిక్కుకుంటుంది. మేం అలా జరగాలని కోరుకోవడం లేదు. కానీ అమెరికా చేష్టల వల్ల ఏదైనా జరిగే పరిస్థితులు నెలకొన్నాయి’’ అని కిమ్ సోదరి స్పష్టం చేశారు. అమెరికా సైనిక శక్తిని గుడ్డిగా నమ్ముకోవడం వదిలేయాలని కిమ్ యో జోంగ్(Powerful Sister) సూచించారు. ఉత్తర కొరియాను కట్టడి చేయడం అమెరికా తరం కాదన్నారు.
Also Read :New MLCs : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నేపథ్యం ఇదీ..
ఉత్తర కొరియాపై ట్రంప్ ఫోకస్
తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో భారీ విమాన వాహక నౌకను అమెరికా మోహరించింది. ఫిబ్రవరి నెలలో ఇదే రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. అప్పటి నుంచే ఉత్తర కొరియా నియంత కుటుంబం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తమ దేశంపై దాడికి ట్రంప్ ఏ క్షణాన ఆదేశాలు జారీ చేస్తారో అర్థం కాక, ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ట్రంప్ సైతం బాగా దూకుడు మీదే ఉన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, గాజా, ఇజ్రాయెల్ మధ్య వేడిని తగ్గించడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. ఉక్రెయిన్‌ను ఒంటరి చేసి, రష్యాకు పైచేయి లభించేలా చేయడంలో ట్రంప్ సఫలమయ్యారు. ఇప్పుడు ట్రంప్ మొత్తం ఫోకస్ ఉత్తర కొరియా నియంతపైనే ఉందని పరిశీలకులు అంటున్నారు.