Site icon HashtagU Telugu

Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్‌ రైలులో చైనాకు కిమ్‌.. అమెరికాకు బలమైన సంకేతం

Kim to China on bulletproof train.. a strong signal to America

Kim to China on bulletproof train.. a strong signal to America

Kim Jong Un : ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగేలా ఒక సంఘటన చోటుచేసుకుంది. అమెరికా ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తూ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం చైనాలో అడుగుపెట్టారు. ఈ పర్యటన, ఆసియా-యూరప్ శక్తుల సమీకరణాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీజింగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవ్వనుండటంతో, ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ రాజకీయ కేంద్ర బిందువుగా మారుతున్న ఈ సమావేశం, అమెరికా ఆధ్వర్యంలోని పశ్చిమ దేశాలకు బలమైన రాజకీయ సందేశం అందిస్తోంది.

Read Also: Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి

ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి ప్యాంగ్యాంగ్ నుంచి తన ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ రైలులో ప్రయాణం మొదలుపెట్టిన కిమ్, విదేశాంగ మంత్రి చో సోన్-హుయ్‌తో పాటు ఉన్నతాధికారులను సైతం వెంట తీసుకువచ్చారు. ఇది 2023లో రష్యా పర్యటన తర్వాత కిమ్ చేసిన తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. అంతేకాదు, 2019 తర్వాత చైనాలోకి ఆయన అడుగుపెట్టడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ ముగ్గురు నేతలు కిమ్, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై దర్శనమివ్వడం మూడు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక బంధానికి సంకేతంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా దౌత్య, రక్షణ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా నూతన శక్తిసంఘటన పునాది వేయాలనే ఉద్దేశంతో ఈ దేశాలు ముందుకెళ్తున్నాయని చెబుతున్నారు. చైనా, ఉత్తర కొరియాకు ఎన్నో దశాబ్దాలుగా మద్దతుగా నిలుస్తోంది.

కానీ ఇటీవలి సంవత్సరాల్లో కిమ్, రష్యాతో సంబంధాలను మరింత బలపరిచారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆయుధాలు, సైనికులు పంపిస్తున్నారనే ఆరోపణలపై అమెరికా, దక్షిణ కొరియా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో చైనాలో కిమ్ పర్యటించడం, మూడు దేశాల మధ్య సమన్వయాన్ని మరింత బలపరచే అంశంగా మారింది. పర్యటనకు ముందు కిమ్ ఓ నూతన క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించడమేకాక, ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ప్రకటించడాన్ని విశ్లేషకులు గమనించారు. ఇది ఉత్తర కొరియా తన సైనిక శక్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు. అయితే, కిమ్ విదేశీ పర్యటనల సమయంలో వినియోగించే బుల్లెట్‌ప్రూఫ్ విలాసవంతమైన రైలు నుంచి ఉత్తర కొరియా పాలకుల ముద్రత వంటి చిహ్నంగా ఉంది. ఈ ప్రయాణ శైలే కాదు, కిమ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రపంచ రాజకీయాలలో మైలురాయులుగా నిలుస్తున్నాయి. ఇంతకాలంగా భిన్నంగా నడిచిన దేశాలైన ఉత్తర కొరియా, చైనా, రష్యా… ఇప్పుడు ఒకే గమ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పర్యటన అనంతరం జరగనున్న మార్పులు, ప్రత్యామ్నాయ శక్తికేంద్రాల ఆవిర్భావం పై ప్రపంచం ఎంతో ఆసక్తిగా తిలకిస్తోంది.

Read Also: Railway employees : రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా