Site icon HashtagU Telugu

KIM JONG UN’s Daughter: మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్ జోంగ్ కుమార్తె..!

Kim4

Kim4

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచారు. మొదటిసారిగా తన తండ్రితో కలిసి హ్వాసాంగ్ -17 క్షిపణి ప్రయోగంలో పాల్గొన్నారు. అప్పుడే ప్రపంచానికి తన కూతురును పరిచయం చేశాడు కిమ్. ఇప్పుడు మరోసారి బ‌హిరంగంగా కనిపించింది. దీంతో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిమ్ తన వారసురాలిగా నాయకత్వ స్థానం కోసం ట్రైనింగ్ ఇస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కిమ్ కుమార్తె పేరు, వయస్సు గురించి ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాలేదు. అయినప్పటికీ…దక్షిణ కొరియా నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ దేశం ప్రధాన గుఢాచారం సంస్థ మాత్రం ఆ అమ్మాయి కిమ్ రెండవ కూతురు అని…వయస్సు పది సంవత్సరాలు, పేరు కిమ్ జు ఏ అని తెలిపింది.

కిమ్ తో తనకూతురు ఉన్న ఫొటోలను రెండో సారి ఆదివారం స్థానిక మీడియా విడుదల చేసింది. ఉత్తరకొరియా సైనికులతో జరిగిన కార్యక్రమంలో తన తండ్రి పక్కన నిలబడి ఫోజులిచ్చింది. కిమ్ 2009లో వివాహం చేసుకున్నాడని..వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని కొరియా మీడియా తెలిపింది. అయితే కిమ్ తన చిన్న కూతురును వారసురాలిగా ప్రపంచానికి పరిచయం చేస్తారన్న ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.