Kim Jong Un – Putin : ఉత్తరకొరియాకు రష్యా ఆ టెక్నాలజీని ఇవ్వబోతోందట !

Kim Jong Un - Putin : రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే  కొమ్సో మోల్క్స్ ఆన్ అముర్ (Komsomolsk-on-Amur) నగరాన్ని సందర్శించారు. 

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:40 AM IST

Kim Jong Un – Putin : రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే  కొమ్సో మోల్క్స్ ఆన్ అముర్ (Komsomolsk-on-Amur) నగరాన్ని సందర్శించారు.  రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో కలిసి ఆ నగరంలో ఉన్న ఏరోనాటిక్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. రష్యా ఆర్మీకి, పౌర అవసరాలకు వినియోగించే అనేక ఉత్పత్తులను ఈ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తుంటారు. ఈసందర్భంగా పుతిన్, రష్యా సైనిక ఉన్నతాధికారులు ఆ కర్మాగారంలోని వివిధ విభాగాల పనితీరు గురించి కిమ్ జోంగ్ ఉన్ కు వివరించారు. వ్లాడివోస్టాక్ నగరంలో ఉన్న రష్యన్ యుద్ధనౌకల తయారీ కేంద్రాలను కూడా కిమ్ విజిట్ చేస్తారని తెలుస్తోంది.  త్వరలో రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన భారీ డీల్ కుదరబోతోంది.

Also read : Visakhapatnam Port Record : వైజాగ్ పోర్టుకు దేశంలో మూడో ర్యాంక్.. ఎందుకంటే ?

ఈనేపథ్యంలో పుతిన్, కిమ్ కలిసి ఆయుధ తయారీ కర్మాగారాలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.  ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా తీవ్రంగా ఆయుధాల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో తమకు ఆయుధ సాయం అందించాలని ఉత్తర కొరియాను రష్యా కోరిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీకిది.. మాకది ప్రాతిపదికన ఆయుధాలను పరస్పరం ఇచ్చుకునే అవగాహనా ఒప్పందాలపై పుతిన్, కిమ్ సంతకం చేయనున్నారని అంటున్నారు.  తొలిసారిగా ఉత్తర కొరియాకు శాటిలైట్‌లను అభివృద్ధి చేసే టెక్నాలజీని అందించేందుకూ పుతిన్ రెడీ అవుతున్నారట. దీనిపై బుధవారం ఇరువుల నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని  తెలుస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమానికి రష్యా  శాటిలైట్ టెక్నాలజీ తోడైతే అంతర్జాతీయ సమాజానికి రిస్క్ మరింతగా పెరుగుతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.