Site icon HashtagU Telugu

North Korea : ప్రపంచానికి తన కూతురును పరిచయం చేసిన కిమ్ జోంగ్ ఉన్..!! ఆ అమ్మాయి ఎలా ఉందంటే..!!

Kim

Kim

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా తన కూతురును బయటప్రపంచానికి తీసుకువచ్చారు. బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం సందర్బంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే ఆమెకు సంబంధించిన విషయాలను మాత్రం బహిర్గతం చేయలేదు.

కిమ్ జోంగ్ ఉన్న అందరికీ తెలిసిన వ్యక్తే అయినప్పటికి…తన వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ తెలియవు. తన కుటుంబానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు కిమ్. తన భార్య పిల్లలు గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. కనీసం ఫొటోలు కూడా బయటరావు. అలాంటిది తాజాగా తన కూతురును ప్రపంచానికి చూపించాడు. కూతురు చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా అగ్రరాజ్యం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా…తన వైఖరిమాత్రం మార్చుకోవడం లేదు కొరియా. మళ్లీ కొరియా ద్వీపంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని చూసేందుకు జోంగ్ ఉన్ తన కూతురును తీసుకుని వచ్చారు. తెల్లటి కోటు ధరించిన అమ్మాయి…జోంగ్ చేతులు పట్టుకుని నిల్చుంది. ఉత్తరకొరియా నాయకత్వ నిపుణుడు మైకేల్ మాట్లాడుతూ…కిమ్ కూతురును చూడటం ఇదే మొదటిసారని చెప్పారు.